ప్రభాస్‌తో డాన్స్ మాస్టర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాహుబలి’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ అంటే ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఓ రేంజ్ ఫాలోయింగ్ ఏర్పడింది. అతడితో సినిమా చేసేందుకు పలువురు దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘సాహూ’ సినిమా చేస్తున్న ప్రభాస్ దీని తరువాత ‘జిల్’ దర్శకుడు రాధాకృష్ణతో మరో సినిమాకు ఓకె చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావచ్చిన ఈ చిత్రం వచ్చే నెలలో సెట్స్‌పైకి రానుంది. అయితే ప్రభాస్‌తో సినిమా చేసేందుకు ఓ ప్రమఖ కొరియోగ్రాఫర్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ కొరియోగ్రాఫర్ ఈ సినిమాతో దర్శకుడిగా మారాలనే యోచనతో ఓ సూపర్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేసుకుని ప్రభాస్‌కు వినిపించే పనిలో ఉన్నాడట. ఇంతకీ ఆ కొరియోగ్రాఫర్ ఎవరో తెలుసా? రాజు సుందరం. డాన్స్ మాస్టర్‌గా స్టార్ హీరోలతో పనిచేసే రాజు సుందరం ప్రభాస్‌తో సినిమా చేయాలనే గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఆ ప్రయత్నాలు వర్కవుట్ అయ్యేలా కనిపించడంలేదు. ఎందుకంటే ‘బాహుబలి’ కోసం ఐదేళ్లు కేటాయించిన ప్రభాస్.. ఇపుడు ‘సాహూ’ సినిమా విషయంలో కూడా రెండేళ్లు పట్టేలా ఉందని అటు ఫాన్స్ తెగ ఫీల్ అవుతున్నారట. అందుకే ఈమధ్యలో ఓ సినిమా చేసి తొందరగా విడుదల చేయాలని ప్లాన్ చేసిన నేపథ్యంలో ‘జిల్’ దర్శకుడికి ఓకె చెప్పాడట. మార్చిలో సెట్స్‌పైకి వచ్చే ఈ చిత్రాన్ని జూన్‌లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇప్పటికే కమిట్ అయిన హిందీ సినిమా కూడా త్వరలోనే పట్టాలు ఎక్కనుంది. మరి రాజు సుందరంతో ప్రభాస్ సినిమా చేస్తాడా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.