ఆఫీసర్.. నాగ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ముంబైలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో శివ, గోవింద గోవింద సినిమాల తరువాత దాదాపు 20 ఏళ్ళ గ్యాప్ అనంతరం వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగార్జున కెరీర్‌లోనే బెస్ట్ చిత్రంగా నిలిచిన శివ తర్వాత ఆ స్థాయిలో తెరెకెక్కుతున్న చిత్రమిది. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం మరో షెడ్యూల్ హైదరాబాద్‌లో జరపనున్నారు. ఈ చిత్రాన్ని మే 25న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మైరా సరీన్ హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఈ చిత్రానికి ఆఫీసర్ అనే పేరు ఖరారు చేశారు. ఈ చిత్రంలో నాగార్జున పోలీసు అధికారిగా కన్పిస్తాడని తెలిసింది. నిజానికి టైటిల్‌తో కూడిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేసింది. ఈలోగా శ్రీదేవి ఆకస్మిక మృతితో వాయిదాపడింది.