కళాకాంతులున్నంత కాలం ‘శ్రీ’ శాశ్వతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ సినిమా 2013లో శత వార్షిక సంబరాలు చేసుకున్నప్పుడు- సిఎన్‌ఎన్ ఐబిఎన్ వాళ్లు చేసిన సర్వేలో - వందేళ్ల ఉత్తమ నటిగా - రూప్ కి రాణిగా ఉత్తరాదిన- అతిలోక సుందరిగా దక్షిణాన వాసికెక్కిన-250 చిత్రాల మహానటి శ్రీదేవి ఎంపికైంది.. నటుల పాలిట బాక్సాఫీసు వరం ఆమె - నటీమణుల పాలిట సింహస్వప్నం కూడా అయిన శ్రీదేవి - నిర్వచనానికి సరిపోయే ‘చైల్డ్ ప్రోడిజి’. కాని ఈ అందాల నటీమణి యాభై ఏండ్ల నట జీవితం- 54 ఏండ్ల పిన్నవయస్సులోనే ఊహించని ట్రాజెడీగా ముగిసి అందరికీ షాక్ ఇచ్చింది. సినీ జనుల గుండెలో ఈమె పేరు చెప్పగానే దక్షిణాదిన ‘‘దేవత’’- ఉత్తరాన ‘చాందిని’ లాంటి- పేర్లు మదిలో తలుక్క్ మంటాయి!... 250 సకల భాష చిత్రాల అద్భుత చలన చిత్రాల యాత్ర- అర్ధంతరంగా ముగిసింది.. శనివారం రాత్రి ఆమె దుబాయ్ హోటలు బాత్‌టబ్‌లో- గుండెపోటుతో- ప్రాణాలు వదిలిన వార్త ఆదివారం ప్రొద్దునే అందరి హృదయాలను- ఇలా పిండి- వదిలి పెట్టింది. ఫిలిం ఇండస్ట్రీలో ఒకే ఒక్క లేడీ సూపర్‌స్టార్‌గా వెలిగిన శ్రీదేవిని అకాల మృత్యువు కాటేసినప్పుడు- అక్కడ ఆమె భర్త బోనీ కపూర్ మాత్రమే వున్నాడు.
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న సామెతను కూడా తోసిరాజన్నది చిన్నారి ‘‘శ్రీ అమ్మా అయ్యప్పన్’’- ఆమె అసలు పేరు శ్రీ అమ్మ శ్రీదేవి అయింది తేరా మీద. నాలుగేళ్ల చిరు ప్రాయంలోనే- కుమారస్వామి పాత్రలో శ్రీదేవి వెండితెరమీద- దద్ధగాయమయమైన స్వర్ణ ఖచిత కిరీటం పెట్టుకుని- అవతరించింది- మాటలు అక్షరాలూ అలాగే కీర్తి కిరీటం ధరించి- నేర్చుకుంటూ ఇండియా అంతా జయించి- చివరికి పోయిన ఏడాది మామ్ (అమ్మ)గా- బుల్లి తేరా వెండి తేరా రెండిటినీ అలరించి- పరిశ్రమలో- ఒకే ఒక్క లేడీ సూపర్‌స్టార్‌గా జేగీయమనమైన కెరీర్‌లో వెండి తెరకు బంగారు ఆభరణం లాగా నిజ జీవితంలో వెలిగింది. - తన ఇద్దరు ఆడపిల్లలకి అమ్మగా ఇక భవిష్యత్తే తన వర్తమానం అనుకుంటూ వుండగా పెద్దపిల్ల తోలి పిక్చర్ జూన్‌లో విడుదల కానుండగా అనంత లోకాలకి ఆసుపత్రి మొహం కూడా చూడకుండా వెళ్లిపోయింది. తెలుగులోనే 85 బయస్కోపులు- ఇంచ్మించు-అన్నీ బాక్సాఫీసు హిట్లే- చేసింది’’.
‘‘చావు పిలుస్తుంది’’ అంటారు- అలాగా దుబాబ్ పెళ్లికి వచ్చిన వాళ్లు- తన భర్తతో సహా అందరు ముంబాయి వెళ్లిపోగా- షాపింగ్ అంటూ వెనక్కి ఉండిపోయింది. జుమేరియా ఎమిరేట్స్ టవర్స్ హోటలు లోకి బస మార్చిన శ్రీదేవిని ‘‘సర్‌ప్రయిజ్’’ చేద్దామని శనివారం మధ్యాహ్నం బోనీకపూర్ ముంబయి నుంచి వచ్చాడు- ‘‘మనం డిన్నర్‌కి పోదాం డార్లింగ్’’ అన్నాడు. పావుగంట ముచ్చటలు అయినాకా ఆమె ‘‘వాష్ రూమ్’’ అంటూ పోయింది- లోపలినుంచి ఎంతకీ రాని భార్య కోసం - బోనీ బాత్‌రూమ్ తలుపులు దబాయించి త్రోసి వెళ్లి చూసేసరికి- నిండుగా వున్న బాత్‌టబ్లోనే మంచి నిద్రలో వున్న జల్కన్యలాగా శ్రీదేవి.. ప్రాణాలు అనంత వాయువుల్లో కలసిపోయాయి.. ఏమి జరిగిందో..? అదే మిస్టరీ.!! శ్రీదేవి ఆఖరి మాటలు విన్నది ‘బోనీకపూర్’ ఒక్కడే.
ఎందరికో ఆరాధ్య దేవతయిన నటి శ్రీదేవి- అన్ని రకాల అన్ని వర్గాల అన్ని వయస్సుల ప్రేక్షకులకి పరమ ప్రీతికరమైన జాబిల్లి- సిరిమల్లిపువ్వు ఆమె. ఫీల్డులో కొందరికి నగీనాలో ఇచ్చ్ధారి నాగిన్ లాగా - 1986- లాగ కూడాకనబడేది. ముఖ్యంగా ఆమె ప్రత్యర్థులు ఇక మళ్లీ మన జయప్రద, మీనాక్షి శేషాద్రిలే.
అమ్రేష్ పూరి మంత్రగాడుగా జనాలని చకితులుగా చేస్తే - ఈమె- నాగిన్‌గా ఆ మంత్రగాన్ని ‘‘తినేసింది’’- ‘తూ మేర దుష్మన్ మై తేరా దుష్మన్.. అంటూ ఆమె చేసిన నాగనృత్యం- ‘మోఘలె ఆజం’లో మధుబాల చేసిన - ప్యారకియాతో డర్నా క్యా ‘డ్యాన్స్‌ని కూడా ‘మట్టేసిమ్ది అంటారు ఫీల్డులోని వాళ్లు. ఐదున్నర అడుగుల పొడగరి, కలువకాడ లాంటి సన్నని చిన్నది శ్రీదేవి ‘‘సింగరు డ్యాన్సర్’’ కూడా. అయితే మన జయప్రదకి ఈమెతో పడదు అనుకున్నాం కదా? - ఓసారి హిందీ సూపర్‌స్టార్లు రాజేష్‌ఖన్నా, జితేంద్ర- జయ అండ్ శ్రీలని- ఎడమొహం పెడమొహం మానండర్రా అని మొత్తుకున్నారుట (1984).. ఇలా కాదు. ఇద్దరు మొండివాల్లె.. మీ పని ఇలా కాదు అని ఇద్దర్నీ ఓ గదిలో పెట్టి బయట గొళ్లెం పెట్టేరుట.. కొన్ని గంటల తరువాత తలుపులు తెరిచి చూస్తె.. ఈ అందాల బొమ్మలు పెదాలు ‘కుట్టేసుకున్నట్లు ‘మొహాలు బెల్లం మెత్తిన రాయిలాగా పెట్టి -- బయటికి చెరోవేపు నడిచారుట- కానీ, రేఖ ఉన్నదిగా.- ఆమె- శ్రీదేవికి హేలపు చేసింది. -శ్రీకి హిందీ రాదుగా.. అందుకని ‘‘ఆఖరి రాస్తా’’ సినిమాలో శ్రీకి డబ్బింగు చెప్పింది రేఖా.. మొదట్లో శ్రీదేవికి నాజ్ (మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్) డబ్బింగు చెప్పింది. - నిజంగా మన రేఖా లాగే శ్రీదేవి కూడా హిందీ ఫీల్డులో పొలిటికల్ ఫీల్డ్సులో కూడా రాణిస్తుంది రాజ్యసభకి గట్రా వెళ్తుంది అని కూడా అనుకున్నాం - కాని సినిమాలు తప్ప మరోధ్యాస లేని ఈ మహానటి చాందిని (వెనె్నల)లో తన డయలాగులు మాత్రమే కాదు పాటలు కూడా సొంతంగా పాడింది. రుషికపూర్- ఈమె కోస్టార్. యశచోప్రాకి యశస్సు డబ్బు తెచ్చిన ఈ సినిమాలో శ్రీదేవి ధరించిన కమీజ్ సేల్వార్‌లు.. ఓకే క్రేజీ ఫేషన్‌గా అయిపోయింది. రెడీమేడ్ కంపెనీలు మేడలు కట్టేసుకున్నారు. అసలు ఎ డ్రస్సు అయిన కొలిచి కుట్టునట్లు నప్పుతుంది ఆమెకి. నాగిన్‌గా నగీనాలో- మొదట జయప్రదనే వేయిద్దాం అనకున్నారట- కాని, శ్రీదేవి కోట్టేసింది చాన్స్. అలాగే రేఖకీ పోతాయనుకున్న కొన్ని పాత్రలు శ్రీదేవి బుట్టలో పడ్డాయి.. కమలహాసన్‌తో 27 సినిమాలు చేసింది- సదమా పిక్చర్ అత్యుత్తమ నటనకి గీటురాయి కాగా, లమ్హేలో (యదస్తులు) ఈమె తల్లీ కూతుళ్ళ పాత్రాలు పోషించింది- దీని హీరో రుషి.
ఏమే విషాద మరనం పరయిగడ్డ మీద చూస్తె ప్రేమపూజారిగా వసికెక్కిన దేవానంద్ గుర్తు కొస్తున్నాడు. - లండన్ వెళ్లిపోయాడు ఆ నటుడు. - నా మరణాన్నిచూసి నా అభిమానులు గుండెలు పగులగొట్టుకుంటారు అనుకున్నాడు- నా మృతదేహాన్ని ఇండియాలో అభిమానులు చూడలేరు- కనుక- నా భౌతిక కాయానికి అంత్యక్రియలు లండన్‌లో చెయ్యమన్నాడు- అలాగా శ్రీదేవి ఇండియాలో మరణిస్తే ఆమె ఫ్యాన్స్ క్రుంగి పోయావరేమో?.. అన్నట్లు ఆమె పరయిగాద్దమీద అసువులు బాసింది. గ్లామర గాల్ శ్రీ అంటారు.
ఈ విషయంలో రజనీకాంత్‌ని అందరూ ఆదర్శంగా తీసుకుని తీరాలి- తను తెరజీవితాన్ని- వెలుపలి రూపాన్ని వేరువేరు చేసేసుకున్న రజనిని - ఎలావున్నా జనం విరగబడి చూస్తున్నారు- రేఖ హేమమాలిని జయప్రద వీళ్లంతా ‘‘యమ గ్లామర్ బొమ్మలు’’ కారా/శ్రీదేవికి ఈ కాన్ఫిడెన్సు లేదు అంటున్నారు.. నమ్మలేము.. ప్రొడ్యుసర్ - నటిగా ఇంకా ఏంతో భవిష్యత్తు వున్న శ్రీదేవిని ‘నీళ్లతొట్టె’లోబూచాడు కబలించాడు- బోనీ కపూర్ మొదటి భార్య కుమారుడు అర్జున్ సనిమా జూన్‌లో విడుదల అవ్వల్సి వుండగా ఆనాడు తల్లి మోనా శౌరీ ముందుగా మార్చ్‌లో అనారోగ్యంతో దుర్మరణం పాలయిందిట. ఇప్పుడు శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ చిత్రం జూన్‌లో విడుదల అంటున్నారు కాని మార్చ్‌లోనే తల్లి హటాత్తుగా - తనువూ చాలించింది.. ఆమె లేని లోటు తల్లిగా ఆ ఇద్దరు పిల్లలిది దుర్భరం.-
సినిమారంగంలో శ్రీదేవి ఎన్నో అద్భుత చిత్రాలని - వారసత్వంగా వదలి వెళ్లింది.. కళ- కాంతి అంటారు- ఈ రెండూ శ్రీదేవి చక్రల్లాంటి కళ్లల్లో నిత్య కాపురం పెట్టుకుని ఉండేవి- కనులతో భావాలు పలికించగల శక్తి ఉగ్గు పాలతోనే సంతరించుకున్నదామె- ఆమె నటించిన సినిమాలు - భావితరాల యువ నటీనటులకు- ఒజ్జ బంతులే- గ్లామర్‌కి సెక్స్‌కి సంబంధం లేదు- ఒళ్ళు కాదు సెక్స్ అప్పీల్‌కి కళ్ళు.. ముఖ్యం.
మంచి కనులు కావాలి రాగానుర్తాగాలను అమలినంగా ‘‘చూపడం’’ శ్రీదేవి తరం నాటి నటులకు అలవాటు. - అల్లా నిరూపించిన ఈ కర్పూరపు బొమ్మ కరిగి అందులోని - దేవి వెళ్ళిపోయినా ‘‘శ్రీ’’ మిగిలింది. పువ్వుగా పుడుతూనే పరిమలించిన అంటారు కాదు ‘్ఫలించినట్లు’ అనాలి ఆమె విషయంలో.. పూర్వ జన్మ సుకృతం ఆమెది.. నిర్మాతలకు కొంగుబంగారం శ్రీదేవి- ఆమె లేని లోటు పూడ్చలేనిది.. అయితే కళ వున్నచోట- కాంతి వున్నచోట అందరికి కనబడుతూనే వుంటుంది. కళా కాంతులకు ప్రతీకగా. కళాకారులకు దర్శనం ఇస్తూనే వుంటుంది.
శ్రీ.. అమ్మ..షి విల్ బి దేర్ యాజ్ లాంగ్ ఏజ్ సినిమా ఈజ్ దేర్!

- వీరాజీ (9290099512)