కళ్యాణం మొదలైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై.. 14 ఏళ్ల క్రితం హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, యువ హీరో నితిన్ కాంబినేషన్లో వచ్చిన ‘దిల్’ సినిమా ఎంత సెనే్సషనల్ హిట్ అయ్యిందో తెలిసిందే. అటువంటి సక్సెస్‌ఫుల్ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కనున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘శ్రీనివాస కల్యాణం’ గత ఏడాది జాతీయ జ్థాయిలో ఉత్తమ ప్రజాదరణ పొందిన ‘శతమానం భవతి’ చిత్రాన్ని రూపొందించిన డైరక్టర్ సతీశ్ వేగేశ్న ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నితిన్ సరసన రాశీఖన్నా, నందిత శే్వత హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మార్చి 16 నుండి ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్ మార్చి 30 వరకు జరుగుతుంది. జూన్ కంతా చిత్రీకరణను పూర్తి చేయడమే కాకుండా.. నిర్మాణానంతర కార్యక్రమాలను కూడా పూర్తి చేసి జూలై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మిక్కి జె.మేయర్ సంగీతాన్ని, సమీర్‌రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. నితిన్, రాశీఖన్నా, నందితా శే్వత, ప్రకాష్‌రాజ్ తదితరులు ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: రామాంజనేయులు, ఎడిటింగ్: మధు, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: బండి రత్నకుమార్, సంగీతం: మిక్కి జె.మేయర్, నిర్మాణం: శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సతీశ్ వేగేశ్న.