జూన్‌లో సవ్య సాచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రేమమ్’ లాంటి సూపర్ సక్సెస్ అనంతరం అక్కినేని నాగచైతన్య, చందు మొండేటిల క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘సవ్యసాచి’. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాధవన్, భూమికలు ప్రత్యేక పాత్రలు పోషిస్తుండగా ‘‘సవ్యసాచి’’ ఫస్ట్ లుక్ మరియు రిలీజ్ డేట్‌లను ఎనౌన్స్ చేసారు మైత్రీ మూవీ మేకర్స్. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వై.నవీన్, వై.రవిశంకర్ మోహన్‌లు మాట్లాడుతూ ‘‘మా యూనిట్ సభ్యులందరికీ ‘సవ్యసాచి’ ఒక స్పెషల్ ఫిలిమ్. ప్రస్తుతం హైదరాబాద్‌లో హీరో నాగచైతన్య, భూమికలపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తవ్వగానే నెక్స్ట్ షెడ్యూల్ కోసం టీం అమెరికా వెళ్లనున్నారు. సినిమా ఫస్ట్ లుక్‌ను మార్చి 18న విడుదల చేయాలనుకొంటున్నాం. అలాగే ‘‘సవ్యసాచి’’ చిత్రాన్ని జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాం. ఆడియన్స్‌ను ఆశ్చర్యపరిచే స్థాయిలో సినిమా ఉంటుంది. ఆర్.మాధవన్ పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక ‘బాహుబలి’ తర్వాత కీరవాణి గారు ‘సవ్యసాచి’కి సంగీతం సమకూర్చడం పత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అన్నారు. నాగచైతన్య, నిధి అగర్వాల్, ఆర్.మాధవన్, భూమిక చావ్లా , రావు రమేష్, వెనె్నల కిషోర్సత్య, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్నారు.