రైతు ఉనికి కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్నేహచిత్ర పతాకంపై ఆర్.నారాయణమూర్తి రూపొందిస్తున్న చిత్రం ‘అన్నదాతా సుఖీభవ’. ఈ సినిమా పాత్రికేయుల సమావేశం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ ‘‘పొద్దు వాలక ముందే నాగలిని భుజాన వేసుకుని పొలానికి వెళ్లి అందరికీ అన్నం పెట్టే రైతు పరిస్థితి నేడు ఎలా ఉంది. రైతు తన ఉనికిని కోల్పోతున్నాడు. రైతు దేశానికి వెనె్నముక అన్న రైతు వెనె్నముక విరిగిపోతుంది. రైతేరాజు అన్న నానుడి ఇప్పుడు లేదు. రైతు దయనీయంగా తయారవుతున్నాడు. అన్నదాతా సుఖీభవ కాస్తా అన్నదాతా దుఃఖీభవ అయిపోయింది. కారణం ఏమిటంటే రైతుకు గిట్టుబాటు ధర లేకపోవడమే. 2009 నుండి నేటి వరకు మూడు లక్షల 25 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అది మన దౌర్భాగ్యం. రైతు బతకాలి. ప్రపంచాన్ని బతికించాలి. 2005లో అప్పటి కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం స్వామినాథన్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. డా.స్వామినాథన్ కమిటీ చేసిన సిఫారసులు ఏంటంటే రైతు పంటకు ఉన్న ధర కంటే 50 శాతం అదనంగా ఇవ్వాలని చెప్పారు. అప్పుడే రైతు బావుంటాడని ఆనాడు స్వామినాథన్ చెప్పిన సిఫార్సు ఇప్పటి వరకు అమలు కాలేదు. ఏ కేంద్ర ప్రభుత్వం ఆ సిఫార్సును అమలు చేయలేదు. దాన్ని అమలు చేయాలని చెప్పడమే మా సినిమాలోని కానె్సప్ట్. రైతు కుటుంబంలో పుట్టడమే పెద్ద నేరంగా చాలామంది ఫీలవుతున్నారు. నేడు మనదేశంలో సామాజికంగా వెనుకబడ్డ వర్గమేదని అంటే అది రైతులు మాత్రమే. లాల్‌బహదూర్ శాస్ర్తీ అప్పట్లో రైతుకు గిట్టుబాటు ధరలను కల్పించి ఆదుకున్నారు. కానీ నేడు ఎవరు అలా చేయడం లేదు. వ్యవసాయం దండగ కాదు.. పండుగ అని చెప్పే చిత్రమే అన్నదాతా సుఖీభవ. ఈ సినిమాలో బాలసుబ్రమణ్యంగారు వంగపండు రాసిన పాటను ఎంతో గొప్పగా పాడారు. ఆయనకు హ్యాట్సాఫ్. గద్దరన్న, గోరేటి వెంకన్న, సుద్ధాల అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. ఈ సినిమాను మా గురువుగారు దాసరి నారాయణరావు గారికి అంకితం చేస్తున్నాం. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ డిమాండ్స్‌కు వ్యతిరేకంగా నేడు దక్షిణాది సినిమా పరిశ్రమ చేస్తున్న పోరాటం చాలా గొప్పది. చాలాసార్లు వారితో మన పరిశ్రమలు వారితో చేసిన చర్చలు విఫలమయ్యాయి. సినిమా పరిశ్రమలు ఎంత దోపిడీకి గురవుతున్నాయో దానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటమిది. డిఎస్‌పి సంస్థలు అగ్రిమెంట్ ప్రకారం రేట్లు ఆపకపోగా పెంచుకుంటూ పోతున్నారు. హాలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమల్లో లేని రేట్స్ మన రీజనల్ సినిమాపైనే ఎందుకు, దీనికి ప్రజలు కూడా సహకరించాలి అన్నారు.