వైరాగ్యం ఏలనో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనరల్‌గా సినిమా స్టార్స్ జీవితాలు సుఖంగా.. రాయల్‌గా సాగుతాయని అనుకుంటారు జనాలు. కానీ ఇక్కడ సుఖం.. సంతోషాలు ఉంటాయన్నది అపోహే అన్న విషయాన్నీ చాలా మంది స్టార్స్ బాహాటంగానే తెలిపారు. ఈ విషయంపై సౌత్ క్రేజీ భామ తమన్నా స్పందించింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె స్పందిస్తూ తమది ఆడంబరాలతో కూడిన జీవితమే తప్ప పెద్దగా ఆనందం ఉండదని అంటుంది. హీరోయిన్స్ ఎవరు సంపూర్ణంగా సంతోషాన్ని అనుభవించడం లేదని, అన్ని కష్టాలు ఉన్నా కూడా షూటింగ్స్‌లో పాల్గొనాలని, మనసులో ఎన్ని బాధలున్నా సరే కెమెరా ముందు నవ్వుతూ నిలబడాలని చెప్పింది. సొంత పనులకు.. సొంత మనుషులకు టైం కేటాయించే సమయం ఉండదని, కనీసం నచ్చిన తిండి కూడా తినలేని పరిస్థితుల్లో ఉండాల్సి వస్తుందని చెప్పింది మిల్కీ భామ. సాధారణ అమ్మాయిలలాగా మేము బతకడం లేదని వాపోయింది. ఇండస్ట్రీస్‌లో అవకాశాల కోసం పరితపించాల్సి వస్తుందని ఆమె వేదాంతం వల్లించింది. తమన్నాలో వేదాంతం ఎందుకో మరి అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం వరుస పరాజయాలతో టెన్షన్ మీదుంది కాబట్టి తమన్నా ఇలా వైరాగ్యంలో ఉందేమో అని అంటున్నారు జనాలు.

చిత్రం.. తమన్నా