ముహూర్తం కుదిరింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తేజ దర్శకత్వంలో బాలకృష్ణ నటించబోతున్న ఎన్టీఆర్ సినిమా ఈ నెల 29న ప్రారంభం కానుంది. మార్చి 29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆ రోజు సినిమాను ప్రారంభించబోతున్నారు. కీరవాణి సంగీతం అందించబోతున్న ఈ సినిమాకు బుర్రా సాయిమాధవ్ మాటలు రాస్తున్నారు. కళ్యాణ్ రామ్ అబ్బాయి ఈ సినిమాలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో బాలయ్య 72 విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారు. కృష్ణ, నాగేశ్వరరావు వంటి నటులతో పాటు సినారె, బాపు వంటి రచయితలు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. పి.వి.నరసింహారావు, ఇందిరాగాంధీ పాత్రలు ఈ సినిమాలో కీలకంగా ఉండబోతున్నాయి. వచ్చే ఏడాది జనవరికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.