‘అనగనగా ఒక ఊళ్ళో’ పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో చంద్ర బాలాజీ పతాకంపై సాయికృష్ణ కె.వి.ని దర్శకుడిగా పరిచయం చేస్తూ కె.చంద్రరావు నిర్మిస్తున్న చిత్రం ‘అనగనగా ఒక ఊళ్ళో’. పల్లెటూరికి వినోద యాత్ర అనేది ట్యాగ్‌లైన్. అశోక్‌కుమార్, ప్రియాంక శర్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఆడియో వేడుక అత్యంత వైభవంగా జరిగింది. హీరో శ్రీకాంత్ ముఖ్య అతిథిగా వచ్చిన ఈ కార్యక్రమంలో నిర్మాత కె.చంద్రరావు, బాలాజీ, శ్రీతేజ్, మనోజ్, బెనర్జీ, సుమన్, దర్శకుడు సాయికృష్ణ కె.వి., సంగీత దర్శకుడు యాజమాన్య, కెమెరామెన్ రాజశేఖర్, హీరో అశోక్‌కుమార్, హీరోయిన్ ప్రియాంక శర్మ, దేవి ప్రసాద్, వంశీ ఆకెళ్ల తదితరులు హాజరయ్యారు. అనంతరం హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ- టైటిల్ చాలా బాగుంది. పల్లెటూరి వాతావరణం ఈ చిత్రంలో చూడబోతున్నాం. సంగీత దర్శకుడు యాజమాన్య మంచి ఆల్బమ్ అందిస్తాడు. చిత్రం మంచి సక్సెస్ అయ్యి దర్శక నిర్మాతలకు, ఆర్టిస్టులకు, టెక్నిషియన్‌లకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అన్నారు. నిర్మాత బాలాజీ మాట్లాడుతూ- రాజవౌళి దగ్గర వర్క్ చేసిన సాయికృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి మంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కుదిరారు. ఈ చిత్రాన్ని రాజోలు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాం. అతి త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. దర్శకుడు సాయికృష్ణ కె.వి. మాట్లాడుతూ- ఇప్పటివరకు నేను 15 చిత్రాలకు వర్క్ చేశాను. ప్రముఖ దర్శకుడు రాజవౌళి దగ్గర వర్క్ చేస్తూనే చాలా నేర్చుకున్నాను. ఆ అనుభవంతో నేను కొన్ని కథలు రాసుకున్నాను. ఈ చిత్ర నిర్మాతకు ఈ కథ బాగా నచ్చడంతో ‘అనగనగా ఒక ఊళ్ళో’ ప్రాజెక్టుని ప్రారంభించాం. రాజోలు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా 40 రోజలు షూటింగ్ చేశాం. చిత్రం చాలా బాగా వచ్చింది. పాటలు చాలా బాగున్నాయని చాలామంది ఫోన్ చేసి అభినందిస్తున్నారు. ఈ నెలలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం అన్నారు..