ఎన్టీఆర్ న్యూలుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రివిక్రమ్ సినిమా కోసం రెడీ అవుతున్నారు ఎన్టీఆర్. ఈ సినిమాలో ఆయన చాలా స్లిమ్‌గా కొత్తలుక్‌లో కనిపించేందుకు జిమ్‌లో కుస్తీలు పడుతున్నారు. అందుకే ఈ మధ్య ఎన్టీఆర్ బయట ఎక్కడా కనిపించడం లేదు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌తోనే అందరికీ షాక్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాడు. మరోవైపు త్రివిక్రమ్ కూడా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ నెల 26 నుండి ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది. త్రివిక్రమ్ మార్క్ స్టయల్లో తెరకెక్కే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎలా ఉంటాడా? అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. తాజాగా ఆయన లేటెస్ట్ ఫొటో ఒకటి లీక్ అయింది. మరి ఎన్టీఆర్ కొత్త లుక్‌లో ఎలా ఉన్నాడో తెలుసా? తాజాగా ఈ ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేసారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. ఇక సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ ఓకే అయ్యాడు. నిజానికి అనిరుధ్‌ని పెట్టాలని ట్రై చేసారు కానీ అజ్ఞాతవాసి దెబ్బకు అనిరుధ్ అవుట్.. దేవి ఇన్?