నువ్వు తోపురా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘లె ఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేమ్ సుధాకర్ కొంత విరామం అనంతరం మళ్లీ వెండితెరపై కనువిందు చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు. హరనాధ్ బాబు.బి దర్శకత్వంలో యునైటెడ్ ఫిలిమ్స్ పతాకంపై డి.శ్రీకాంత్ నిర్మిస్తున్న చిత్రం ‘నువ్వు తోపురా’ షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.ఈ సందర్భంగా హీరో సుధాకర్ కొమాకుల మాట్లాడుతూ- ఈ చిత్రంలో నా పాత్ర అన్ని భావోద్వేగాలను కలగలపి వినూత్నంగా ఉంటుంది. యువతరం తమని తాము ఈ పాత్రల్లో చూసుకుంటారు. ఈ చిత్రం నాకు మరో మెట్టు పైకి ఎదిగేలా చేస్తుందని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ చిత్రంతో ప్రేక్షకుల్లో మరియు ఇండస్ట్రీలో ఒక మంచి పేరు సంపాదిస్తామని ఆశిస్తున్నాం అన్నారు. చిత్ర నిర్మాత డి.శ్రీకాంత్ మాట్లాడుతూ- సుధాకర్ కొమాకుల, నిత్యాశెట్టిలు జంటగా రూపొందుతున్న ‘నువ్వు తోపురా’ చిత్రీకరణ 70 శాతం అమెరికాలో, 20 శాతం ఇండియాలో షూట్ చేశాం.