బాలీవుడ్ నటి షమ్మి ఇకలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలనాటి ప్రఖ్యాత బాలీవుడ్ నటి షమ్మి (89) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సందీప్ ఖోస్లా ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ ఆమెకు నివాళులు అర్పించారు. 18ఏళ్ల వయసులో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన షమ్మిని బాలీవుడ్‌లో అందరూ ముద్దుగా ‘షమ్మి ఆంటీ’ అని పిలుచుకునే వారు. ‘ఉస్తాద్ పెడ్రో’ చిత్రంతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ‘మల్హర్’ ఆమె నటించిన తొలిచిత్రం. కూలీ నెం.1, ఖుదా గవా, హమ్, ఆర్థ్, ది బర్నింగ్ ట్రెయిన్ తదితర చిత్రాల్లో ఆమె నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. పలు ధారా వాహికల్లోనూ నటించిన ఆమె బాలీవుడ్ దర్శక నిర్మాత సుల్తాన్ అహ్మద్‌ను వివాహం చేసుకున్నారు. వివాహమైన ఏడేళ్లకే ఇద్దరూ విడిపోయారు. షమ్మికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.