అజిత్ హారర్ సినిమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోలీవుడ్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్ తరువాత ఆ రేంజ్‌లో ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో అజిత్. తలా అజిత్‌గా ఫాన్స్ పిలుచుకొనే అజిత్, మొదటిసారి ఓ హారర్ సినిమా చేయడానికి ఓకె చెప్పాడు!? ప్రస్తుతం ఆయన దర్శకుడు శివతో ఓ సినిమా చేస్తున్నాడు. శివ-అజిత్‌ల కాంబినేషన్‌లో వచ్చిన వీరం, వేదమ్, వివేకం, సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. అయితే ఈసారి వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ కొత్త ప్రయోగం చేయాలని ఇలా హర్రర్ నేపథ్యంలో కథను ఎంచుకున్నారట. అన్నట్టు ఈ సినిమాను విశ్వాసం అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్స్ పనులు పూర్తయిన ఈ సినిమా ఈనెలలో సెట్స్‌పైకి రానుంది. మరి హారర్ సినిమాతో అజిత్ ఎలా భయపెడతాడో చూడాలి!