క్రిష్ దర్శకత్వంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ కెరీర్‌ని చక్కగా ప్లాన్ చేసుకుంటున్నాడు అల్లు అర్జున్. కథలతోపాటు పాత్రల విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం నా పేరు సూర్య సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా కోసం అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. నాపేరు సూర్య సినిమా దాదాపు పూర్తికావచ్చింది. మే 4న విడుదలకానున్న ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ కోసం పలువురు దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఒక్కక్షణం ఫేమ్ వి.ఐ.ఆనంద్ కూడా ఉన్నాడు. అయితే తాజాగా ఆ లిస్టులోకి మరో దర్శకుడు వచ్చి చేరాడు. ఆయన ఎవరో కాదు క్రిష్. ప్రస్తుతం హిందీలో కంగనా రనౌత్‌తో మణికర్ణికా సినిమా చేస్తున్న క్రిష్‌తో నెక్స్ట్ సినిమా చేయాలని ప్లాన్ చేశాడట బన్నీ. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన వేదం సినిమా నటుడిగా అల్లు అర్జున్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. అందుకే తదుపరి చిత్రాన్ని ఆయనతో చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.