పాటల ఛల్ మోహన్ రంగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫస్టు లుక్కు సోమవారం. మాట కలిపి మంగళవారం’ అంటూ మన యువ కథానాయకుడు నితిన్ ‘గ ఘ మేఘ’తో ఉన్న తన అనుబంధాన్ని శ్రోతలతో పంచుకున్నారు. నితిన్ మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘్ఛల్ మోహన రంగ’. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా, శ్రీమతి నిఖితా రెడ్డి సమర్పణలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, త్రివిక్రమ్ మరియు శ్రేష్ఠ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫస్టు లుక్కు సోమవారం అంటూ మొదలయ్యే సాహిత్యాన్ని సీరియస్‌గా తీసుకున్నారేమో తెలియదు కాని నిజంగానే ఈ సినిమా ఫస్టు లుక్ రిలీజ్ చేశారు. ఇక ఈ వారం గీతం విడుదల అయింది. ఈ పాటతో జనాలకి మరోసారి మంచి మెలోడీ అందించిన థమన్ ఈసారి మంచి డాన్స్ నెంబర్‌తో వస్తున్నారు. ఆయన పాటల్లో ట్యూన్‌కి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఇన్‌స్ట్రుమెంట్స్‌కి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఆ సంగీతానికి సాహిత్యం తోడైతేనే ఆ పాట జనాల హృదయాలలో ఎక్కువ రోజులు నిలుస్తుంది. వారంలో ఏడు రోజులు ఉంటే, ఒకో రోజుకి ఓకో ప్రత్యేకత ఉందంటూ తనదైన చమత్కారాన్ని వాడి, సాహిత్య అవార్డ్ గ్రహీత కేదారనాథ్ ఈ పాటను రచించగా, నాకాష్ అజీజ్ తన స్వరంతో పాటను శ్రోతలకి మరింత చేరువగా తీసుకొచ్చారు. సంగీత, సాహిత్యాల కలబోత చిత్రంలోని పాటలు అన్నారు దర్శకుడు కృష్ణ చైతన్య. నిర్మాత ఎన్.సుధాకర్‌రెడ్డి చిత్రాన్ని ఏప్రిల్ 5న ప్రేక్షకుల మందుకు తీసుకువస్తున్నట్టు ప్రకటించారు. చిత్రంలోని ఇతర ప్రధాన తారాగణం: డా.కె.వి.నరేష్, లిజి, రోహిణి హట్టంగడి, రావు రమేష్, సంజయ్ స్వరూప్, ప్రభాస్ శ్రీను, నర్రా శ్రీను, మధునందన్, ప్రగతి, సత్య, సంగీతం: థమన్, ఎస్, కెమెరా: ఎన్.నటరాజ సుబ్రమణియన్, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, నృత్యాలు: శేఖర్, వి.జె, పోరాటాలు: స్టంట్ సిల్వ, రవివర్మ, సమర్పణ: శ్రీమతి నిఖితరెడ్డి, నిర్మాత: ఎన్.సుధాకర్‌రెడ్డి, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కృష్ణ చైతన్య.