కణం పాటలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగశౌర్య, సాయిపల్లవి జంటగా ఎన్.వి.ఆర్. సినిమా సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కణం’. మార్చిలో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ- ‘కణం’ సినిమాను తెలుగులో మా ఎన్‌విఆర్ బ్యానర్‌పై విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. నాగశౌర్య, సాయిపల్లవి ఇద్దరూ హ్యట్రిక్ సక్సెస్‌లను ఈ సినిమాతో సాధించాలని కోరుకుంటున్నాను. విక్రమ్ వేద సినిమాకు సంగీతాన్ని అందించిన శామ్ సి.ఎస్. ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. నీరవ్ షా ప్రతి విజువల్‌ను గొప్పగా పిక్చరైజ్ చేశారు. సినిమాలో వెరోనికా అనే చిన్న పాప అద్భుతమైన పాత్రలో నటించింది. ఈ సినిమాను 37 రోజుల్లో పూర్తి చేశారు. ఇంత మంచి సినిమాను తెలుగులో విడుదల చేసే అవకాశం ఇచ్చిన లైకా సంస్థ ప్రతినిధులు సుభాష్ కరణ్, కరుణాకరన్, రాజ మహాలింగప్పలకు థాంక్స్ అన్నారు.బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ- సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న నా మిత్రుడు ఎన్.వి.ప్రసాద్‌కు, సినిమాలో నటించిన అందరికీ అభినందనలు తెలిపారు.దర్శకుడు విజయ్ మాట్లాడుతూ- మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే వుంటారు. కరు సినిమాను తెలుగులో కణంగా విడుదల చేస్తున్నాం. తెలుగు, తమిళంలో సినిమాను తెరకెక్కించాం. ఎన్.వి.ప్రసాద్ ఎంతో ప్యాషనేట్‌గా సినిమాను విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. మంచి టైమ్ కోసం వెయిట్ చేసి తెరకెక్కించాను అన్నారు. సాయిపల్లవి మాట్లాడుతూ- తల్లికి, బిడ్డకు మధ్య ఉన్న అనుబంధం, తపనే ఈ సినిమా కథ. సినిమాకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయి చేశాను. ఇలాంటి కథను నమ్మి సినిమాను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్‌కు థాంక్స్ అన్నారు.