‘నెల్లూరి పెద్దారెడ్డి’ తెలుసా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరి పెద్దారెడ్డి పేరు వినగానే మనకు ప్రఖ్యాత హాస్యనటుడు బ్రహ్మానందం ఇట్టే గుర్తుకు వస్తాడు. జె.డి చక్రవర్తి హీరోగా నటించిన ‘అనగనగా ఒకరోజు’ సినిమాలో బ్రహ్మానందం చెప్పిన ఈ డైలాగ్ ఎంతటి పాపులర్ అయిందో మనకు తెలిసిందే. అయితే తాజాగా అదే పేరుతో ఇప్పుడు ఓ సినిమా కూడా తెరకెక్కింది. సి.హెచ్ రఘునాథరెడ్డి నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి వి. జయరాం రెడ్డి దర్వకత్వం వహించారు. నిర్మాణానంతర పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు వి. జయరాం రెడ్డి మాట్లాడుతూ- ‘నెల్లూరి పెద్దారెడ్డి అనే ఒక వ్యక్తి బయోపిక్ ఇది. నెల్లూరుకు చెం దిన పెద్దారెడ్డి కుటుంబం ఖమ్మం జిల్లా సీతారాంపురం అనే గ్రామానికి వలస వస్తారు. అయితే ఆ ఊరిలోని ప్రజలు ఈ పెద్దారెడ్డి కుటుంబం వాళ్లని నెల్లూరువాళ్లు అని పిలవడంతో అదే వారి ఇంటిపేరుగా మారుతుంది. అదికాస్త నెల్లూరి పెద్దారెడ్డిగా మార్పుచెందుతుంది. ఆయన జీవితకథనే సినిమా తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రంలో సతీష్‌రెడ్డి హీరోగా నటించారు. ఇందులో వౌర్యాని, ముంతాజ్ అనే ఇద్ద రు కథానాయికలు నటించారు. వారి పాత్రలు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తాయి. హీరోయిన్ వౌర్యాని ‘అర్థనారి’ సినిమాతో మంచి నటిగా నంది అవార్డు గెలుచుకుంది. తర్వాత జానకిరాముడు, ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం’ అనే సినిమాలో కూడా నటించింది. చక్కటి కథతో సాగే ఈ చిత్రం ఆద్యంతం అందర్నీ ఆకట్టుకుంటుంది. చక్కటి సన్నివేశాలు, ఇంటిల్లిపాది చూసి ఆనందించే వినోదం అన్నీ సమపాళ్లలో కుదిరాయి. ఇప్పుడొస్తున్న కథలకు భిన్నంగా ఉంటూ చక్కటి వినోదాన్ని ప్రేక్షకులకు పంచుతుంది. ఇందులో రెండు పాటలున్నాయి. అవి అందర్నీ ఆకట్టుకుంటాయి. ఈ పాటలను కమలాకర్ కామేష్ ఆద్యంతం ఆసక్తికరంగా రచించారు. అలా గే ప్రభాస్ శీను, అంబటి శీను, శాంతి స్వరూప్ (జబర్ధస్త్‌ఫేం) వంటి హాస్యనటు లు చక్కటి వినోదాన్ని పంచారు. చిత్రం అందర్నీ అలరించడం ఖాయం. ఈ చిత్రం విజయాన్ని అందుకుంటుందన్న నమ్మకం వుంది. ఈనెలలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’’ అన్నారు.