జూ.షకీలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో బయోపిక్ సినిమాల హవా ఓ రేంజ్‌లో వుంది. ఇప్పటికే పలు బయోపిక్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు అందుకోవడంతోపాటు దర్శక నిర్మాతలకు మంచి గుర్తింపును తెచ్చిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో కల్పిత కథలకంటే కూడా బయోపిక్‌లనే ఎంచుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం సైనా నెహ్వాల్, సంజయ్‌దత్‌ల బయోపిక్‌లు రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో సంచలన బయోపిక్ కోసం రంగం సిద్ధమైంది. ఈసారి బయోపిక్ ఎవరిదో తెలిస్తే షాక్ అవుతారు. సౌత్‌లో అప్పట్లో ఆమె సినిమా వచ్చిందంటే చాలు, స్టార్ హీరోలు సైతం వెనక్కి తగ్గాల్సిందే. ముఖ్యంగా మలయాళంలో సూపర్‌స్టార్లుగా వెలుగొందిన మమ్ముట్టి, మోహన్‌లాల్‌లకే చెమటలు పట్టించిన ఆ సంచలన తార ఎవరో మీకు ఈపాటికే అర్థమై వుంటుంది. ఆమే షకీలా. సౌత్ ఇండియా శృంగార తారగా ఇమేజ్ తెచ్చుకున్న షకీలా సినిమాలు ఒక్క మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ విడుదలై సంచలనం సృష్టించాయి. ఆమె హవా 90ల దశకంలో ఓ రేంజ్‌లో సాగింది. ఈమె జీవిత కథతో సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్. 16 ఏళ్ళకే శృంగార తారగా సంచలనం సృష్టించిన షకీలా జీవిత కథతో తెరకెక్కే చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ రిచా చద్దాను ఎంపిక చేశారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది. సౌత్ సంచలన తార సిల్క్ స్మిత జీవిత కథతో తెరకెక్కిన చిత్రంలో నటించి విద్యాబాలన్ సంచలన తారగా మారింది. మరి ఆమె రూట్‌లోనే రిచా చద్దా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి!