భయం, బాధ్యత ఉండాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా క్రేజీ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రం ‘్భరత్ అనే నేను’. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 20న భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా విజన్ ఆఫ్ భరత్ పేరుతో చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నారు. మహేష్ వాయిస్‌ఓవర్‌తో మొదలైన టీజర్ ప్రస్తుతం ప్రకంపనాలు సృష్టిస్తోంది. ముఖ్యంగా యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. చిన్నప్పుడు మా అమ్మ నాకు మాట చెప్పింది- ఒక్కసారి ప్రామిస్ చేసి ఆ మాట తప్పితే యూ ఆర్ నాట్ కాల్డ్ ఏ మ్యాన్ అని. ఎప్పటికీ ఆ మాట తప్పలేదు, మర్చిపోలేదు. నా జీవితంలోనే అతి పెద్ద ప్రామిస్ చేయాల్సిన రోజొకటి వచ్చింది. అది పెద్దదే కాదు కష్టమైంది కూడా. కానీ ఎంత కష్టమైనా ఆ మాట కూడా తప్పలేదు. బికాస్ ఐ యామ్ ఎ మాన్. వి ఆర్ లీవింగ్ ఇన్ ఎ సొసైటీ. ప్రతి ఒక్కరికీ భయం, బాధ్యత ఉండాలి.. ప్రామిస్ అంటూ మహేష్ ఎమోషనల్‌గా చెప్పిన డైలాగ్ ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించింది. శ్రీమంతుడు తరువాత వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కూడా సామాజిక నేపథ్యంలో రూపొందడంతో అటు బిజినెస్ పరంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ సరసన కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రకాష్‌రాజ్ శరత్‌కుమార్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.