బంద్ వెనుక స్వార్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మేలు కోసం కాకుండా కొందరు వ్యక్తులు స్వార్థ ప్రయోజనాల కోసమే సినిమా థియేటర్ల బంద్ జరుగుతోందని నిర్మాత నట్టికుమార్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నట్టికుమార్ మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ చిన్న సమస్య కోసం గత ఆరు రోజులుగా థియేటర్లను బంద్ చేయించడం విడ్డూరంగా ఉంది. దీనివల్ల వంద కోట్లకు పైగా ఎగ్జిబిటర్లు, చిన్న నిర్మాతలు నష్టపోయారు. గతంలో ఎన్నో జఠిల సమస్యలు ఎదురైనా ఒకటి, రెండు రోజులకు మించి థియేటర్లను మూసివేసిన దాఖలాలు లేవు. కానీ డిజిటల్ ప్రొవైడర్లను బతిమిలాడుకోవాల్సిన అవసరమే లేదు. క్యూబ్, యుఎఫ్‌ఓ, పిఎక్స్‌డి వాళ్లు తమ మిషన్‌లను థియేటర్లకు అమర్చి దాదాపు తొమ్మిదేళ్లు కావస్తోంది. వాళ్ల పెట్టుబడి పోను ఆ సంస్థలు ఎప్పుడో లాభాల్లోకి వచ్చేశాయి. అయినా అధిక చార్జీలను ఎగ్జిబిటర్లు, నిర్మాతల దగ్గర వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న నిర్మాతలు, చిన్న డిస్ట్రిబ్యూటర్లు చాలా నష్టపోతున్నారు. ఈ బంద్ కారణంగా అనేక చిన్న సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. త్వరలో వరసగా విడుదల కాబోయే పెద్ద సినిమాలు రంగస్థలం, భరత్ అనే నేను, నా పేరు సూర్య విడుదల కాబోయే తేదీలను ఈ కమిటీ మార్చగలదా? చిన్న సినిమాలను కాపాడే పెద్ద మనసు ఉంటే వెంటనే ఆ చిత్రాల విడుదల తేదీలలో మార్పులు చేయించి, చిన్న సినిమా నిర్మాతలకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు.