11న కళా వైభవోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంటు సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి డా.టి.సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో కాకతీయ కళాపరిషత్ సంస్థను స్థాపించిన విషయం తెలిసిందే. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వైభవోపేతంగా అలనాటి కాకతీయ సామ్రాజ్య కళావైదుష్యాన్ని, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో నెలకొల్పిన ఈ కళాపరిషత్ కార్యక్రమాన్ని ఈనెల 11న మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు బ్రహ్మానందంను విశిష్ట సేవలకు గుర్తింపుగా హాస్య నటబ్రహ్మ బిరుదుతో ఘనంగా సత్కరించనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ, ఓరుగల్లు రాజధానిగా విశాల తెలుగుదేశాన్ని మూడువందల ఏళ్లకుపైగా పాలించిన కాకతీయ ప్రభువుల కాలం చరిత్రలో సువర్ణ యుగం. ప్రజాసంక్షేమం కోసం లలితకళా వికాసం కోసం రాజ్యి విస్తృతి కోసం కాకతీయ గణపతిదేవ చక్రవర్తి చేసినన్ని కార్యక్రమాలు ఎవరూ చేసివుండరు. వారు నిర్మించిన దేవాలయాలు ఇప్పటికీ ఎంతో ప్రఖ్యాతిగాంచాయి. అందుకోసమే కాకతీయ కళాపరిషత్‌ను స్థాపించాం. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మొదటగా ఈనెల 11న మహబూబ్‌నగర్‌లో వైభవంగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు అతిథులుగా వస్తారని, ఈ వేదికపై జయప్రద, రాజశేఖర్, జీవిత, బాబూమోహన్, పరుచూరి గోపాలకృష్ణ, అలీ, కవిత, కేథరీన్, హంసానందిని, శ్రద్ధాదాస్, పృథ్వి, రఘుబాబు, శ్రీనివాసరెడ్డిలను కాకతీయ పురస్కారాలతో సత్కరిస్తాం. అలాగే మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సాహిత్య సంగీత నృత్య కళాకారులను కూడా సత్కరించుకుంటామని అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ, కళలు, కళాకారులన్నా సుబ్బిరామిరెడ్డిగారికి ఎంతో ఇష్టం. అందుకే ఆయన కళాకారులను సన్మానించుకుంటారని అన్నారు.