ఆరబోస్తేనే అవకాశాలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాల్లో అవకాశాలు రావాలంటే నాకు టాలెంట్ ఉంది.. నేను గొప్పగా నటిస్తా అంటూ కథలు చెబితే ఎవ్వరు అవకాశాలు ఇవ్వరు.. తప్పకుండా అందాల ఆరబోయాల్సిందే అని ఖరాఖండీగా చెప్పింది గ్లామర్ భామ ఆండ్రియా. ఇప్పటికే సంచలన హీరోయిన్‌గా ముద్ర వేసుకున్న ఈ అమ్మడు ఎన్ని సినిమాలు చేసినగాని పాపం కెరీర్ పరంగా సరైన కమర్షియల్ సక్సెస్ మాత్రం దక్కలేదు. దాంతో సెకెండ్ హీరోయిన్‌గానే సెటిల్ అయింది. ఈమధ్యే సిద్ధార్థ్‌తో ‘గృహం’ అంటూ ఓ హర్రర్ సినిమాలో మెరిసిన ఈ భామకు టాలెంట్ పుష్కలంగా వున్నా కూడా అవకాశాలు మాత్రం పెద్దగా రావడంలేదు. ఏ అవకాశం వచ్చినా గ్లామర్ తప్పనిసరి అంటున్నారట. ఈ అమ్మడిలో మరో టాలెంట్ కూడా ఉంది.. అదేమిటో తెలుసా- తాను మంచి సింగర్ కూడా. చాలా పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ- ఇక్కడ అవకాశాలు రావాలంటే అందాలు ఆరబోయాల్సిందేనని, కెరీర్ మొదట్లో నయనతార, దీపికాలు కూడా అందాలు ఆరబోసే ఈ స్థాయికి వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేసింది ఆండ్రియా. మొత్తానికి మరోసారి సంచలన తారగా వార్తల్లో నిలిచింది.