కొరటాల శివతో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక సినిమాను మించి మరో సినిమాతో సంచలన విజయాలు అందుకున్న దర్శకుడు కొరటాల శివ అంటే ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ క్రేజ్. ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం క్యూలో ఉన్నారు. ప్రస్తుతం మహేష్‌బాబుతో భరత్ అనే నేను సినిమా తెరకెక్కిస్తున్న కొరటాల ఈ సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం లండన్‌లో ఓ షెడ్యూల్ జరుగుతోంది. ఈ చిత్రం ఏప్రిల్ 20న విడుదల కానుంది. ఈ సినిమాతో ఆయన మార్కెట్ కూడా ఓ రేంజ్‌లో పెరుగుతుందని అంటున్నారు. ఇక కొరటాల నెక్స్ట్ సినిమా ఎవరితో అన్న ఆసక్తి ఎక్కువైంది. ఇప్పటికే పలువురు హీరోల పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఫైనల్‌గా నానితో సినిమా చేస్తాడని అంటున్నారు. ఇదివరకే రామ్‌చరణ్‌తో సినిమా చేయాలని కమిట్ అయ్యాడు. కానీ ప్రస్తుతం చరణ్-బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నాడు. అది పూర్తయ్యేవరకూ నాని సినిమా తెరకెక్కిస్తాడట. మహేష్ సినిమా పూర్తవ్వగానే నాని సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. వరుస విజయాలతో జోరుమీదున్న నానితో సినిమాలు తీయడానికి అటు దర్శకులు కూడా క్యూ కడుతున్నారు మరి.