కన్నడ రీమేక్‌లో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎన్‌టిఆర్ బయోపిక్ సినిమాకోసం బిజీగా మారాడు. మహానటుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు ఎన్టీఆర్. తేజ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం ఈనెల 29న హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభం కానుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోందని తెలుస్తోంది. మరోవైపు బాలకృష్ణ హీరోగా మరో చిత్రం తెరకెక్కించేందుకు పలువురు దర్శకులు పోటీపడుతున్నారని, ఈ నేపథ్యంలో ఓ కన్నడ హిట్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తారని వార్తలొస్తున్నాయి. కన్నడంలో ఇటీవలే ఘనవిజయం సాధించిన ‘మఫ్టీ’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారంటూ వార్తలు జోరందుకున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కార్యక్రమాలు మొదలయ్యాయని అంటున్నారు. ఇందులో నిజానిజాలు ఏమిటన్నది తెలియాల్సి వుంది. బాలకృష్ణ 103వ చిత్రంగా ఎన్‌టిఆర్ సినిమా తెరపైకి రానుంది. దాంతోపాటు కుర్ర దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేస్తాడంటూ కూడా వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరో చిత్రం కూడా వుండబోతుందట.