అభిమాని కోసం పవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనను అభిమానించే అభిమానులకోసం హీరోలు ఎన్నో కార్యక్రమాలు చేయడం తన అభిమానులను ఆనందపరచడం ముఖ్యోద్దేశ్యంగా భావిస్తారు హీరోలు. అలాగే టాలీవుడ్‌లో కూడా పవన్‌కళ్యాణ్ అంటే ఎంత క్రేజో అందరికీ తెలుసు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో వుంటుంది. సాధారణ అభిమానులతోపాటు సినిమా హీరోలు కూడా ఆయనకు అభిమానులుగా మారిపోయినవారున్నారు. తాజాగా ఈ లిస్టులో మొదటగా చెప్పుకోవాల్సింది నితిన్. పవన్‌కళ్యాణ్ అభిమానిగా వున్న నితిన్, ప్రస్తుతం పవన్ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చల్ మోహనరంగ చిత్రం ఈ నెల 25న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేస్తారట. నితిన్ ఈమధ్య తన సినిమా ఈవెంట్లకు ముఖ్య అతిథిగా పవన్‌ను ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిర్మించే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆయన గెస్ట్‌గా వస్తున్నాడట. పవన్‌తోపాటు త్రివిక్రమ్ కూడా పాల్గొంటాడని తెలిసింది. హైదరాబాద్‌లో జరిగే ఈ వేడుకను భారీగా ప్లాన్ చేస్తున్నారు. నితిన్ సరసన మేఘా ఆకాష్ హీరోయిన్‌గా నటిస్తోంది.