అభిమాని ప్రేమ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సొట్టబుగ్గల తాప్సీకి ఇక్కడ ఎన్ని సినిమాలు చేసినా పెద్దగా కలిసి రాలేదు. దాంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ చేసిన రెండు మూడు సినిమాలతో నటిగా ఇమేజ్ తెచ్చుకుంది కానీ గ్లామర్ హీరోయిన్‌గా మాత్రం ఆకట్టుకోలేదు. దాంతో మళ్లీ సౌత్‌లోనే తనకు నచ్చిన గ్లామర్ పాత్రల్లో చేయాలని రీఎంట్రీ ఇచ్చేసింది. తాజాగా ఈమెకు అభిమానుల క్యూ పెరిగిపోతోందట. ముఖ్యంగా తనను ప్రేమించేవారి లిస్టు కూడా పెరిగిపోతోందని తెగ మురిసిపోతోంది. ఈమధ్యే తనకు ఓ అభిమాని పంపిన ప్రేమలేఖను చదివి ఫిదా అయిందట. ఇంతకీ ఆ యువకుడు ఏమి రాశాడో తెలుసా? ‘‘మందు ముట్టను, మాంసం ముట్టను, అన్నింటికంటే ముఖ్యంగా నేను వర్జిన్‌ని. నీమీద నాకున్న ప్రేమ నిరూపించుకునేందుకు నార్కోటిక్ పరీక్షకైనా, లై డిటెక్టర్ పరీక్షకైనా సిద్ధమే. నా మెదడును పూర్తిగా పరీక్షించడం మాత్రం మరువద్దు’’ అని లేఖ పంపించాడట. బెస్ట్ ప్రపోజల్ ఎవర్, వెజిటేరియన్ లవ్. ఇంకేం కావాలి అంటూ కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.