రిపోర్టర్‌గానే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీనియర్ నటీమణి సావిత్రి జీవిత కథతో మహానటి చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ లీడ్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు కూడా కనిపిస్తుండడం విశేషం. ముఖ్యంగా సమంత మరో ముఖ్యపాత్రలో కన్పిస్తుందట. అయితే ఈ చిత్రంలో ఆమె పాత్ర నటి జమున పాత్ర అని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై మరో క్లారిటీ వచ్చింది. ఇందులో సమంత పాత్ర రిపోర్టర్‌గానే వుంటుందని, సావిత్రి కెరీర్‌లో కీలక పాత్ర పోషించిన మధురవాణి అనే పేరుతో ఈ పాత్ర సాగుతుందని తెలిసింది. ఇక ఈ చిత్రంలో జెమిని గణేశన్‌గా దుల్కర్ సల్మాన్ నటిస్తుండగా, అక్కినేని పాత్రలో నాగచైతన్య కన్పించబోతున్నాడు. మోహన్‌బాబు, విజయ్ దేవరకొండ, షాలిని పాండే, మాళవికా నాయర్‌లు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై ప్రియాంకా దత్ నిర్మిస్తున్నారు.