సమ్మర్ సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొత్తానికి సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ అనగానే సినిమావాళ్ళకి పెద్దపండగ. దాదాపు రెండు నెలలపాటు సినిమాలని భారీగా విడుదల చేసుకోవచ్చు. పరీక్షలు అయిపోగానే వేసవి సెలవులు వచ్చేస్తాయి. వేసవి సెలవులంటే పిల్లలతోపాటు పెద్దలకూ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక సినిమావాళ్లు కూడా ఈ సమ్మర్‌లో తమ సినిమాల్ని విడుదల చేసి క్రేజ్ తెచ్చుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. సంక్రాంతి, దసరా లాటి పెద్ద పండగలు మహా అయితే వారం రోజులపాటు వుంటాయి. కానీ సమ్మర్ అంటే రెండు నెలలు ఖాళీయే. ఇక ఈ ఏడాది సమ్మర్‌లో భారీ పోటీ నెలకొంది. పలు చిత్రాలు నువ్వా నేనా అంటూ విడుదలకు పోటీపడుతున్నాయి. ప్రతి శుక్రవారం భారీ చిత్రాలతో ప్రేక్షకులకు కనువిందు చేయడానికి రంగం సిద్ధం అవుతోంది. ఈ సమ్మర్‌లో దాదాపు వెయ్యి కోట్లవరకూ బిజినెస్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఎవరెవరు ఎలా సమ్మర్ సమరానికి సిద్ధమవుతున్నారో చూద్దాం! సమ్మర్ బరిలో దిగేందుకు మొదటి అడుగు వేస్తున్నాడు రామ్‌చరణ్. సుకుమార్‌తో కలిసి ఆయన చేసిన ‘రంగస్థలం’ చిత్రం ఈనెల 30న భారీగా విడుదలకు సిద్ధమైంది. 1980 నేపథ్యంలో అచ్చమైన పల్లెటూరులో జరిగిన కథతో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా బిజినెస్ వర్గాల్లో సంచలనం రేపిన ఈ చిత్రంపై ముఖ్యంగా మెగా అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. రంగస్థలంతో కౌంట్‌డౌన్ మొదలైంది. ఇక ఈ లిస్టులో రెండో అడుగు పెట్టడానికి సిద్ధవౌతున్నాడు సూపర్‌స్టార్ మహేష్‌బాబు. ఈసారి ఆయన ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు. శ్రీమంతుడు లాంటి సంచలన విజయాన్ని అందుకున్న కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా తారాస్థాయికి చేరాయి. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగిందని టాక్. మహేష్ కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 20న విడుదలకు సిద్ధమవుతోంది. మహేష్ కన్నా ముందే వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో నాని ఈసారి ఏకంగా ద్విపాత్రాభినయంతో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు. కృష్ణార్జునయుద్ధం పేరుతో తెరకెక్కిన ఈ చిత్రానికి మేర్లపాక గాంధి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుదలవుతోంది. అలాగే యువ హీరోగా యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నితిన్ కూడా ‘చల్ మోహనరంగ’ అంటూ ఏప్రిల్ 5న వస్తున్నాడు. పవన్‌కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ కథను అందించడం విశేషం. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాల్ని పెంచుకుంది. ఇక వీరితోపాటు సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా కబాలి వంటి సంచలన చిత్రాన్ని తెరకెక్కించిన పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాలా’ చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలై దుమారేమే రేపుతోంది. మరోవైపు రజనీ నటించిన అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రోబో 2.0 కూడా విడుదలకు సిద్ధంగా వుంది. ఇక ఈ లిస్టులోకి ఎంట్రీ ఇస్తున్నాడు సూర్య. అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రం మే 4న విడుదలకు సిద్ధమవుతోంది. ఆర్మీ అధికారిగా అల్లు అర్జున్ నటిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ ఇంపాక్ట్ ఓ రేంజ్‌లో టాలీవుడ్‌లోనే సంచలనం రేపింది. అల్లు అర్జున్ న్యూ డైమెన్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఇక ఈ సినిమాతోపాటు మహానటి సావిత్రి జీవిత కథతో నాగఅశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ నటించిన ‘మహానటి’ కూడా మే 9న విడుదలకు సిద్ధమైంది. దాంతోపాటు కింగ్ నాగార్జున హీరోగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ఆఫీసర్ చిత్రం కూడా మేలో రానుంది. మాస్ రాజా రవితేజ హీరోగా కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నేల టికెట్’ చిత్రం కూడా మే 24న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి మంచి జోష్‌తో సినిమాలు చేస్తున్న రవితేజ నేల టికెట్‌తో సంచలనం క్రియేట్ చేస్తాడని తెలుస్తోంది. దాంతోపాటు విజయ్‌దేవరకొండ టాక్సీవాలా, రాజ్‌తరుణ్ రాజుగాడు లాంటి అరడజనుకుపైగా చిత్రాలున్నాయి. -

శ్రీ