ఆశ.. అత్యాశల మధ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ ‘చతురంగ వేట్టై’ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆశ, అత్యాశల మధ్య ఆసక్తికరంగా సాగిన ఈ కథకు తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. భావోద్వేగాలకు ప్రాంతీయ బేధాలుండవు. ఎక్కడైనా ఈ కథ నీరాజనాల అందుకుంటుందనే నమ్మకంతో ఆ కథను తెలుగు ప్రేక్షకులకోసం తెరకెక్కిస్తున్నారు అభిషేక్ ఫిలిమ్స్ అధినేత రమేష్ పిళ్లై. ప్రముఖ నిర్మాత శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. 75 శాతం చిత్రీకరణ పూర్తయింది. సత్యదేవ్ హీరోగా నందితాశే్వత జంటగా నటిస్తున్నారు. గోపీ గణేష్ పట్ట్భా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి నిర్మాత రమేష్‌పిళ్లై మాట్లాడుతూ.. ‘తొలిసారిగా అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై లారెన్స్ నటించిన శివలింగ తమిళ చిత్రాన్ని తెలుగులో అనువదించి మంచి విజయాన్ని సాధించాము. తమిళంలో ఘన విజయాన్ని సాధించిన చిత్రం ‘చతురంగ వేట్టై’, తెలుగులో రీమేక్ చేస్తున్నాం. ఇప్పటికి 75 శాతం చిత్రీకరణ పూర్తయింది. కొడైకెనాల్, వైజాగ్, హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. తాజాగా హైదరాబాద్‌లోనే మార్చి 23 నుంచి షెడ్యూల్ చేస్తున్నాం. ఇదే ఆఖరి షెడ్యూల్. ఏప్రిల్ 15తో పూర్తవుతుంది. ఎక్కడా రాజీపడకుండా హైటెక్నికల్ వేల్యూస్‌తో తెరకెక్కిస్తున్నాం. డబ్బింగ్, పోస్ట్‌ప్రొడక్షన్ పనులను పూర్తిచేసి జూన్ చివరివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలో టైటిల్‌ని ప్రకటిస్తాం. ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌అయ్యే సినిమా ఇది అని అన్నారు.