ప్రేమలో పడలేదు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను ఆరాధించే పవన్‌కళ్యాణ్ నాతో సినిమా నిర్మించడమే గొప్ప అనుభూతి అని అంటున్నాడు యువ హీరో నితిన్. జయం చిత్రంతో హీరోగా కెరీర్ మొదలుపెట్టి అటుపై వరుస సినిమాలతో స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్‌లో ఎత్తుపల్లాలను చవిచూసి తనదైన ఇమేజ్‌ను సృష్టించుకున్నాడు. తాజాగా ఆయన చల్‌మోహన్‌రంగా అంటూ వస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కథను అందిస్తుండగా, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నిర్మిస్తుండగా కృష్ణచైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఏప్రిల్ 5న విడుదలకు సిద్ధమైంది. నేడు నితిన్ పుట్టిన రోజు సందర్భంగా హీరో నితిన్‌తో ఇంటర్వ్యూ..
* పవన్, త్రివిక్రమ్‌లతో ఈ ప్రాజెక్టు ఎలా
సెట్ అయింది?
- లై సినిమా షూటింగ్ సమయంలోనే చల్‌మోహన్‌రంగ చేయాలని నేను, త్రివిక్రమ్ అనుకున్నాం. ఆ సమయంలో కృష్ణచైతన్య దర్శకత్వంలో చేస్తే బాగుంటుందని ప్లాన్ చేశాం. ఈ సినిమా గురించి కథ, పాత్రలు అన్నీ త్రివిక్రమ్ ఆలోచనలోంచి పుట్టినవే. దాని ఆధారంగానే కృష్ణచైతన్య ప్రతి సన్నివేశాన్ని రాసుకున్నాడు. తను చేసిన రౌడీఫెలో బాగా నచ్చడంతో ఈ సినిమాను బాగా డీల్ చేస్తాడని అనిపించింది. అంతా రెడీ అయ్యాక ఓ రోజు పవన్‌కళ్యాణ్‌తో త్రివిక్రమ్ ఈ సినిమా గురించి చర్చించారు. నేను, సుధాకర్ రెడ్డి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని చెప్పాడు. అప్పుడు పవన్ మీరే కాదు నేను కూడా నిర్మాతగా ఉంటానని అనడంతో ప్రాజెక్టు పట్టాలెక్కింది.
* మీ పాత్ర ఎలా ఉంటుంది?
- నా పాత్ర చాలా ఫన్నీగా ఉంటుంది. గుండెజారి గల్లంతయ్యిందే సినిమా తరువాత ఆ రేంజ్‌లో మరో సినిమాలో నేను కామెడీ చేయలేదు. కానీ ఈ చిత్రం మాత్రం దాన్ని మించి వుంటుంది. ఇందులో హీరో పాత్ర అందరినీ వాడేస్తూ నవ్విస్తూ వుంటాడు. త్రివిక్రమ్ స్టైల్లో డైలాగులు, ఎమోషన్స్ వున్న సినిమా ఇది.
* ఇంతకూ కథ ఏమిటి?
- మూడుసార్లు వీసా రిజెక్ట్ అయ్యి అమెరికా వెళ్లిన హీరోకి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. దాన్ని ఎలా చక్కబెట్టాడు అన్నదే అసలు కథ. సినిమా మొత్తం పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ వేలో సాగుతుంది. హీరోలో మంచి జోష్ ఉంటుంది కాబట్టి చల్‌మోహనరంగ అనే టైటిల్ పెట్టారు.
* పవన్‌కళ్యాణ్‌ను అభిమానించే మీతో ఆయన
సినిమా చేయడం ఎలా ఉంది?
- నిజంగా ఆయనను నేను ఎంతగా ఆరాధిస్తానో అందరికీ తెలుసు. అలాంటి పవన్‌కళ్యాణ్‌ను చూస్తే చాలు, ఫొటో దిగితే చాలు అనుకున్న నాకు, ఆయన నిర్మాతగా నాతో సినిమా చేయడం అంతకంటే అదృష్టం మరోటి లేదు.
* ఇందులో పవన్ కన్పిస్తాడా?
- లేదు. ఆయన సినిమా నిర్మించడమే ఎక్కువ. అలాంటి సినిమాలో నటించమని కోరితే అత్యాశే అవుతుంది. ఈ సినిమాలో ఎలాంటి అతిథి పాత్రలో కన్పించరు.
* పవన్ అభిమానిగా ఆయన రాజకీయాల్లోకి పిలిస్తే వెళ్తారా?
- నిజానికి పవన్‌కళ్యాణ్ అభిమానిగా చాలా గర్వపడుతున్నాను. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన ఉద్దేశ్యం గొప్పది. నిజంగా ఆయన పిలిస్తే తప్పకుండా వెళ్తా.
* లై సినిమా నిరాశపర్చిందా?
- నిజంగా చాలా ఫీల్ అయ్యాను. అది చాలా ఇంటెలెక్చ్యువల్ మూవీ. సరైన సమయంలో విడుదల కావాల్సి వుంది. కానీ ఎక్కువ సినిమాలమధ్యలో రావడంతో ఫలితం మరోలా మారింది.
* మేఘా ఆకాష్‌తో రెండవసారి?
- హీరోయిన్ పాత్రకోసం మేఘా అయితే బాగుంటుందని దర్శకుని సూచన మేరకు తీసుకోవడం జరిగింది. తను మంచి నటి. చాలా కాంపిటీటివ్‌గా వుంటుంది. రెండు సినిమాలు వరుసగా చేయడం అలా కుదిరాయి.. అంతే!
* ప్రేమలో పడ్డారని వార్తలొస్తున్నాయి? మరి పెళ్లెప్పుడు?
- ప్రేమలో పడడమా! అంత ఛాన్స్ లేదు. సినిమాలతోనే బిజీగా ఉన్నాను. ఇంకా ప్రేమించేందుకు టైమెక్కడిది? ఇక పెళ్లంటారా? రోజూ ఇంట్లో పెళ్లిచేసుకోమని ఒకటే గోల పెట్టేస్తున్నారు.
* తదుపరి చిత్రాలు?
- ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్‌లో శ్రీనివాస కల్యాణం చేస్తున్నాను. ఆ చిత్రం జూలై 24న విడుదలవుతుంది. దాంతోపాటు హరీశ్ శంకర్‌తో ఓ సినిమా, వెంకీ కుడుములతో మరో సినిమా ఉంటుంది.

- శ్రీ