బాలీవుడ్ ఆఫర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్లలో ఒకరిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ శృతిహాసన్ గత కొంతకాలంగా ఏ సినిమాకు ఓకె చెప్పడంలేదు. తెలుగు, తమిళ భాషల్లో పలు అవకాశాలు వస్తున్నా కూడా ఎలాంటి అంగీకారం తెల్పడంలేదట. ఆమె తండ్రి కమల్‌హాసన్ తెరకెక్కించిన శభాష్ నాయుడు చిత్రంలో మాత్రమే నటించింది. అయితే శృతిహాసన్ ఫోకస్ మొత్తం బాలీవుడ్‌పైనే వుందని, బాలీవుడ్ నుంచి అవకాశాలు వస్తేనే ఓకె చెబుతుందట. ఈ నేపథ్యంలో తాజాగా ఓ బాలీవుడ్ ఆఫ్‌ర్‌కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. బాలీవుడ్ నటుడు విద్యుత్ జమాల్ హీరోగా మహేష్ మంజ్రేకర్‌తో కలిసి ఓ సినిమా చేయనున్నాడు. విజయ్ గలాని నిర్మించే ఈ చిత్రంలో హీరోయిన్‌గా శృతిహాసన్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. గత కొద్దికాలంగా ఏ సినిమాలు ఒప్పుకోకుండా ఓ మ్యూజికల్ ఆల్బం రూపొందించే పనిలో వున్న శృతి, బాలీవుడ్ ఆఫర్‌కి ఓకె చెప్పడం విశేషం. అయితే దక్షిణాదిలో స్టార్‌హీరోల చిత్రాల్లో అవకాశాలు వస్తున్నా కూడా వాటన్నింటినీ కాదని బాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్ లేని హీరోల సరసన నటించేందుకు ఒప్పుకోవడంతో సినీ జనాలు షాక్ అవుతున్నారు.