తాప్సీ జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాదిలో హీరోయిన్‌గా ఆశించినస్థాయిలో కమర్షియల్ విజయాలు అందుకోలేక నిరాశగా వున్న తాప్సి ఎప్పుడైతే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటినుంచే ఆమె జోరు పెరిగింది. పింక్, షబానా చిత్రాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న తాప్సి, జుడువా-2 చిత్రంతో గ్లామర్ హీరోయిన్‌గా బికినీలోనూ షాకిచ్చింది. దాంతో ఈ అమ్మడికి తెగ అవకాశాలు వస్తున్నాయట. ఇప్పటికే అనురాగ్ కాశ్యప్ దర్శకత్వంలో అభిషేక్ బచ్చన్‌తో కలిసి నటిస్తున్న మన్ మర్జియాన్ చిత్రంలో నటిస్తోంది. దాంతోపాటు తెలుగులో ఆది పినిశెట్టితో మరో సినిమా చేస్తోంది. అలాగే ముల్క్ అనే సినిమాకు సైన్ చేసింది. దాంతోపాటు హాకీ ప్లేయర్ కథతో తెరెకెక్కే సూర్మా చిత్రంలో కూడానటిస్తోంది. మొత్తానికి చేతిలో అరడజనుకుపైగా చిత్రాలున్నాయి. సినిమాలతోపాటు ప్రమోషన్‌లలో కూడా పాల్గొంటూ తీరిక లేకుండా బిజీగా మారింది సొట్టబుగ్గల తాప్సి.