సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఆది భగవాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయం రవి, నీతూచంద్ర జంటగా రెడ్‌సన్ ప్రొడక్షన్స్ పతాకంపై అన్బూపిక్చర్స్ సమర్పణలో రూపొందిన చిత్రం ‘ఆది భగవాన్’. ఈ చిత్రాన్ని తెలుగులోకి అందిస్తున్నారు జి.దేవా, బి.శ్రీ్ధర్. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధవౌతున్న సందర్భంగా నిర్మాతలు వివరాలు తెలిపారు. ‘తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రానికి తెలుగు రైట్స్ కోసం భారీ పోటీ మధ్య ఈ హక్కుల్ని మేం సొంతం చేసుకున్నాం. ఈమధ్య కాలంలో జయం రవి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నాడు. ఈ కథ గురించి చెప్పాలంటే- బాంబే మాఫియా లీడర్‌గా ఓ హిజ్రా, మరో గ్యాంగ్ లీడర్ సింగపూర్‌లో ఉంటాడు. అతను చేసే పనులకు హిజ్రా డాన్ బలౌతుంటాడు. సింగపూర్ గ్యాంగ్ లీడర్‌ని కిడ్నాప్ చేసి, వాడే హిజ్రా అని అధికారులను నమ్మించి బాంబే హిజ్రా మాఫియా గూండాగా చలామణి అవుతుంటాడు. ఎవరు ఎవర్ని కిడ్నాప్ చేశారనే సస్పెన్స్‌తో కథ నడుస్తుంది. యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇందులో జయం రవి ద్విపాత్రాభినయం చేశాడు’ అన్నారు. చిత్రానికి నిర్మాణ, నిర్వహణ: జి.దేవ, బి.శ్రీ్ధర్, దర్శకత్వం: అమీర్.