విలన్ వేషాలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మొత్తం మీరే చేశారు.. మొత్తం మీరే చేశారు..!’’ అంటూ తెలుగులో హీరోగా ఓ రేంజ్ ఇమేజ్ దక్కించుకున్న సిద్ధార్థ్‌కు ‘బొమ్మరిల్లు’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించింది. ఆ ఒక్క సినిమాతో తెలుగులో స్టార్ ఇమేజ్ అందుకున్న సిద్ధార్థ్ ఆ తరువాత చాలా చిత్రాలు చేశాడు. ఈమధ్య వరుస పరాజయాలతో కెరీర్ వెనక్కి తగ్గింది. ప్రస్తుతం అవకాశాలు తగ్గిన సిద్ధార్థ్.. ఇప్పుడు ప్రతినాయకుడిగా రీఎంట్రీ ప్రయత్నాల్లో ఉన్నాడు. అటు బాలీవుడ్‌లో కూడా మంచి ఇమేజ్ తెచ్చుకున్న సిద్ధార్థ్ తాజాగా కమ్మర సంభవం అనే మలయాళ సినిమాతో విలన్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో హీరో దిలీప్.. హీరోకి సమానంగా సిద్ధార్థ్ విలన్ పాత్ర ఉంటుందని టాక్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్‌లో సిద్ధార్థ్ కూడా త్వరలోనే పాల్గొంటాడట. మరి విలన్‌గా సిద్ధు ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటాడో చూడాలి!