22న మిలట్రీ మాధవరంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లుఅర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’. కె.నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్‌లో శిరీష శ్రీ్ధర్ నిర్మాతగా, బన్నీవాసు సహనిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్‌కింగ్ అర్జున్, శరత్‌కుమార్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 22న మిలట్రీ మాధవరంలో ఆడియో ఫంక్షన్ చేయబోతున్నారు. మే 4న సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... మిలట్రీ మాధవరం... ఈ ఊరుపేరు తెలియని దేశ భక్తులుండరేమో. ఈ ఊరి నుంచి గడపకొక్కడు భారతదేశ సరిహద్దుల్లో కాపుగాస్తూ.. మనందరి యోగక్షేమాలకోసం నిరంతరం శ్రమిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలానికి చెందిన గ్రామం మాధవరం. బ్రిటీష్ పాలనలోనే ఈ గ్రామం నుంచి అనేకమంది యువత సైన్యంలో ఉన్నారు. రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్నారు. అందులో కొందరు అమరులయ్యారు. ఈ గ్రామంలో ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక్కరైనా సైన్యంలో ఉంటారంటే అతిశయోక్తికాదు. అందుకే మిలట్రీ మాధవరం పేరు సార్థక నామధేయంగా మిగిలింది. అలాంటి వీర సైనికుల నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమే ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. పవర్‌ఫుల్ యాక్షన్ ఎమోషనల్ చిత్రంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ సైనికుడి పాత్రకోసం ప్రత్యేకంగా తననుతాను మలచుకున్న విధానం ఔరా అనిపిస్తుంది. ఎందరో అమరవీరుల్ని తలచుకుంటూనే... ప్రతీక్షణం మన రక్షణకోసం.. ప్రతీ ఇంటినుంచి ఓ వీర సైనికుడిని దేశంకోసం త్యాగంచేసిన కుటుంబాల్ని ప్రత్యక్షంగా కలుసుకునేందుకు నా పేరు సూర్య చిత్రం ఆడియో ఫంక్షన్ మిలట్రీ మాధవరంలో చేయాలని నిర్ణయించాం. ఈనెల 22న ఆడియో ఫంక్షన్ గ్రాండ్‌గా చేసేందుకు ఏర్పాట్లుచేస్తున్నాం. సైనికుల త్యాగాల్ని మరోసారి గుర్తుచేసుకునేలా.. వారిని గౌరవించుకునేలా.. ఈ కార్యక్రమం ఉండబోతుంది. అల్లు అర్జున్‌తోపాటు చిత్ర యూనిట్ అంతా ఈ ఆడియో ఫంక్షన్‌లో పాల్గొనబోతున్నారు. ఈ ఊరు గురించి తెలుసుకున్న వెంటనే మా యూనిట్ అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజల్ని కలవటం జరిగింది. ఆ ఊరు గొప్పదనాన్ని మా యూనిట్ ద్వారా విన్నాం. మనం దేశంభక్తి నేపథ్యంలో తీస్తున్న ఈ చిత్రం కాబట్టి ఒక్కసారి అక్కడికి వెళ్ళి రావాలని అందరం అనుకున్నాం. మా హీరో అల్లు అర్జున్‌ని చెప్పగానే ఎంతో ఆనందంగా నేను వస్తాను అనటం విశేషం. అక్కడ కొన్ని కుటుంబాల్ని బన్ని కలుసుకుంటారు. వారి సమక్షంలోనే ఆడియోని చెయ్యాలని నిర్ణయించుకున్నాం అని అన్నారు.