ఆ కల నెరవేరింది..! -- * నిర్మాత డి.వి.వి.దానయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘్భరత్ అనే నేను’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం శుక్రవారం విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా కన్పించనున్నారు. ఈ చిత్రం విడుదల సందర్భంగా నిర్మాత డి.వి.వి.దానయ్య చెప్పిన విశేషాలు...
ఇన్నాళ్లకు...
మహేష్‌బాబుతో సినిమా చేయాలన్న నా కోరిక ఇన్నాళ్లకు ఈ చిత్రంతో నెరవేరింది. ఈ విషయంలో కొరటాల శివకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి. చాలా కాలంగా మహేష్‌తో సినిమా చేయాలని ఆయనను అడుగుతూ ఉన్నాను. మంచి కథ వుంటే చేద్దామని మహేష్ చెప్పాడు. ఇలాంటి మంచి కథ కుదరడంతో మా బ్యానర్‌కు ప్రతిష్ఠాత్మకంగా నిలిచే చిత్రంగా భరత్ వుంటుంది.
వివాదాలు లేవు..
ఈ సినిమా ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన కథతో సాగుతుంది. ఏ పార్టీకి సంబంధం ఉండదు. పైగా ఎవరినీ విమర్శించే సినిమా కాదు. మంచి మెసేజ్ వున్న సినిమా. ఓ మంచి ముఖ్యమంత్రి ప్రజలకు ఎలాంటి మంచి పనులు చేశాడన్నదే ఈ చిత్రం. కథ విన్నపుడే సినిమాను గ్రాండ్‌గా చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. ప్రతి విషయంలో కొరటాల శివ సహకారం ఉంది. ఈ సినిమా కోసం రెండు కోట్లు పెట్టి అసెంబ్లీ సెట్, వచ్చావయ్యా సామి.. అనే పాట కోసం నాలుగు కోట్లు ఖర్చుపెట్టి మరో సెట్ వేశాం. ఆ పాటను పెద్ద స్క్రీన్‌పై చూస్తే థ్రిల్ ఫీల్ అవుతారు.
అంచనాలను మించేలా..
ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్, పాటలతో మరిన్ని అంచనాలు పెరిగాయి. ఖచ్చితంగా ఆ అంచనాలను మించేలా సినిమా వుంటుంది. నేను గర్వంగా నా బ్యానర్‌లో ఇంత మంచి సినిమా తీశానని చెప్పుకునే చిత్రమిది.
మహేష్‌తో సాన్నిహిత్యం..
నేను చాలామంది స్టార్ హీరోలతో పనిచేశాను. కానీ మొదటినుంచీ మహేష్‌తోనే ఎక్కువ అనుబంధం ఉంది. ఆయనతో చాలాకాలంగా జర్నీ చేస్తున్నాను. ఉదయం ఎంత ఎనర్జీగా ఉంటారో సాయంత్రం అదే ఎనర్జీతో కన్పిస్తారు. సినిమా అంటే ఆయనకు చాలా ఇష్టం. అలాగే హీరోయిన్ ఖైరా అద్వానీ అద్భుతంగా నటించింది. అచ్చతెలుగు అమ్మాయిలా కన్పిస్తుంది. ఈ సినిమాతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారుతుంది.
దర్శకుడి గురించి..
కొరటాల శివ గురించి నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. కథ విషయంలో ఆయన పర్‌ఫెక్ట్‌గా ఉంటారు. ఇప్పటివరకూ ఆయన చేసిన సినిమాలను మించే స్థాయిలో ఈ సినిమా ఉంటుంది. నేను ఆయనకు రుణపడి ఉంటాను. మహేష్‌తో సినిమా చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు.
నిర్మాతగా..
మాది పశ్చిమ గోదావరి జిల్లా. తాళ్లపూడి గ్రామం. అప్పట్లో మా వూళ్లో సినిమా షూటింగ్‌లు ఎక్కువగా జరిగేవి. అలా సినిమాలపై ఆసక్తి కలిగింది. ఆ ప్రభావంతోనే పరిశ్రమలోకి వచ్చాను. అనుకోకుండా నిర్మాతగా మారాను. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన జంబలకిడి పంబ చిత్రంతో భగవాన్, పుల్లారావులతో కలిసి నిర్మాతగా సినిమా చేశాను.
తదుపరి చిత్రాలు
ప్రస్తుతం చరణ్-బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఈ నెల 21 నుంచి మరో షెడ్యూల్ ప్రారంభిస్తున్నాం. దాంతోపాటు రాజవౌళి దర్శకత్వంలో తెరకెక్కే మల్టీస్టారర్ కూడా ఈ ఏడాదిలోనే ప్రారంభవౌతుంది. రాజవౌళితో సినిమా అన్నది నా కల. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

-శ్రీ