నా కథలో నేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాంబశివ, సంతోషి శర్మ జంటగా శివప్రసాద్ గ్రంధె స్వీయ దర్శకత్వంలో జిఎస్‌కె ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ నా కథలో నేను. నవనీత్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఓ పాటను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ఈ చిత్రంలోని పాట బాగుంది. నవనీత్ వినసొంపైన సంగీతాన్ని అందించాడు. కొత్తవాళ్ళైనా కష్టపడి మంచి సినిమా చేశారు. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అయి వీరి ప్రయత్నం ఫలించాలి అన్నారు. దర్శక నిర్మాత శివప్రసాద్ మాట్లాడుతూ- అడిగిన వెంటనే మా కోరిక మన్నించి ఈ చిత్రంలోని పాటను విడుదల చేసినందుకు విజయేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరికీ నచ్చే అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తామన్నారు. చిత్రానికి కెమెరా: లక్కి ఏకారి, సంగీతం: నవనీత్, పాటలు: వౌనికా ఎకారి, రచన, నిర్మాత, దర్శకత్వం: శివప్రసాద్ గ్రంధె.