నీ ప్రేమకోసం పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జొన్న పరమేష్, రాధ బంగారు జంటగా ఉలి దర్శకత్వంలో మాస్టర్ గోవింద్ బోగోజు సమర్పణలో సరోవర్ ఫిలిమ్స్ పతాకంపై ఉప్పుల గంగాధర్ నిర్మిస్తోన్న చిత్రం ‘నీ ప్రేమకోసం’. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో జరిగింది. గౌరవ అతిథి పాత్రలో నంబి వేణుగోపాలాచార్య కౌశిక, ముఖ్యఅతిథి పాత్రలో సింహరాజు కోదండరాములు, ప్రత్యేక పాత్రలో శ్రీ మంజునాథ విజయ్‌బాబు నటిస్తున్నారు. నంబి వేణుగోపాలాచార్య కౌశిక సీడీలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉలి అన్నీతానై పనిచేశాడు. అతని కష్టానికి తగ్గ ఫలితం అందుకుంటాడు. ప్రతిభగల దర్శకుడు. సినిమా విజయం సాధించి యూనిట్ అందరికీ మంచి పేరు, ప్రఖ్యాతులు తీసుకురావాలి అని అన్నారు. చిత్ర దర్శకుడు ఉలి మాట్లాడుతూ.. ‘రొటీన్ లవ్ స్టోరీలకు భిన్నంగా ఉండే సినిమా ఇది. ప్రపంచ శాంతి సందేశంలో అద్భుతమైన ప్రేమకథా చిత్రంగా నిలుస్తుంది. ప్రేమ కానె్సప్ట్‌కు.. నేను పెట్టిన ‘డు ఆర్ డై’ అనే ఉప శీర్షికకు సంబంధం ఏంటని చాలామందికి సందేహాలున్నాయి. అది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ కథను ఓ ఛాలెంజింగ్‌గా తీసుకుని తెరకెక్కించాను. అంతా చక్కగా నటించారు. ప్రేక్షకులంతా మా సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నా’అని అన్నారు. సహ నిర్మాత గోలి వెంకటరమణ మాట్లాడుతూ.. ‘నిజ జీవితంలో మనుషుల పాత్రలు మా సినిమాలో కనిపిస్తాయి. ప్రతీ ఒక్కరి జీవితంలో ఎన్నోరకాల సమస్యలు, బాధలు ఉంటాయి. వాటిని మా దర్శకుడు కళ్లకుకట్టినట్లు చూపించారు. పాటలు, సినిమా పెద్ద విజయం సాధిస్తాయని ఆశిస్తున్నా’ అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వేమూరి చంద్రశేఖర్, ఎడిటింగ్: సంపత్‌రాజ్, సత్రాజ్, సంగీతం: కె.లక్ష్మణసాయి, నిర్మాత: ఉప్పుల గంగాధర్, కథ, మాటలు, పాట, చిత్ర కథనం, దర్శకత్వం: ఉలి.