జూలై నుండి కొత్త సినిమా!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బాహుబలితో ఇండియా వైడ్‌గా సూపర్‌స్టార్‌గా మారిన ప్రభాస్ అంటే ఇపుడు ఓ రేంజ్‌లో క్రేజ్ నెలకొంది. ఆయనతో సినిమాలు చేసేందుకు పలు భాషలకు చెందిన దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం అత్యంత భారీగా తెరకెక్కుతున్న ‘సాహో’ చిత్రంలో నటిస్తున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ఈ చిత్రం దుబాయ్‌లోని అబూదబిలోని కీలక ప్రాంతాల్లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సినిమా తరువాత ఆయన మరో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని జూలై 7న ప్రారంభిస్తారట. అయితే ఈ చిత్రాన్ని గోపీకృష్ణ మూవీస్ బ్యానర్‌పై రెబెల్‌స్టార్ కృష్ణంరాజు నిర్మించనున్నాడు. ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా ఎంపిక చేశారట. ప్యూర్ లవ్‌స్టోరీగా తెరకెక్కే ఈ సినిమా తరువాత ఈ ఏడాది చివరిలో హిందీ సినిమా చేసే అవకాశాలున్నాయి.