4న శివగంగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరామ్, రాయ్‌లక్ష్మి జంటగా ఎక్సెల్లా క్రియేషన్స్ పతాకంపై వి.సి.వడి ఉడయాన్ దర్శకత్వంలో కె.శివనాథ్, మారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలుగులో అందిస్తున్న చిత్రం ‘శివగంగ’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని తెలుగు, తమిళ భాషల్లో ఈనెల 4న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, ప్రస్తుతం హారర్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో, ‘శివగంగ’ చిత్రం కూడా అదే స్థాయిలో తెరకెక్కిందని, భారీ బడ్జెట్‌తో హైటెక్నికల్ విలువలతో రూపొందిన హారర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులకు నచ్చుతుందని తెలిపారు. అన్ని కమర్షియల్ హంగులతో, ఊహించని ట్విస్టులతో సినిమా రెండు ఆత్మల ప్రతీకార నేపథ్యంలో సాగుతుందని, తెలుగు, తమిళ ప్రేక్షకులకు తెలిసిన నటుడు శ్రీరామ్ ఈ చిత్రంలో శివ, శక్తి అనే రెండు పాత్రలను పోషించారని వారు తెలిపారు. 37 నిమిషాలపాటు గ్రాఫిక్స్ ఈ చిత్రానికి హైలెట్ అవుతాయని, సుమన్ విలన్‌గా నటించడం మరో వైవిధ్యమైన విషయమని తెలిపారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్నామన్నారు. హారర్ ఎలిమెంట్స్‌తో ఉన్న ఈ చిత్రానికి కథ పెద్ద ఎసెట్ అవుతుందని, కణల్‌కణ్ణన్ ఫైట్స్, జాన్‌పీటర్ సంగీతం, ఎస్.శ్రీనివాస్‌రెడ్డి కెమెరా పనితనం హైలెట్‌గా నిలుస్తాయని, ఈనెల 4న ప్రేక్షకుల ముందుకు రానున్నామని దర్శకుడు వడి ఉడయాన్ అన్నారు. రేఖ, వడి ఉక్కరసి తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: ఎన్.రాజశేఖర్‌రెడ్డి, పాటలు: వెలిదండ్ల, వనమాలి, ఎడిటింగ్: ఎలీనా, సంగీతం: జాన్‌పీటర్, నిర్మాతలు: కె.శివనాథ్, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, దర్శకత్వం: వి.సి.వడి ఉడయాన్.