అర్ధ శతదినోత్సవంలో సోగ్గాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున కథానాయకుడుగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణకృష్ణ కురసాల దర్శకత్వంలో ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం 110 కేంద్రాలలో అర్ధశతదినోత్సవం జరుపుకుని, శత దినోత్సవం వైపు పరుగులు తీస్తోంది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ అన్ని విధాలా సంతృప్తికలిగించిన విజయం ఇదని, సంక్రాంతికి విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చి, 50 రోజులు దిగ్విజయంగా పూర్తిచేసుకుని, ఇంకా ప్రదర్శింపబడుతున్నందుకు ఆనందంగా వుందని అన్నారు. దర్శకుడు ఈ చిత్రాన్ని అందరికీ నచ్చేలా రూపొందించాడని, అందుకే ఇంత పెద్ద హిట్ అయిందని, తన అభిమానులంతా ఈ చిత్రాన్ని చూసి గర్వపడుతున్నారని ఆయన అన్నారు. అభిమానుల కళ్లల్లో ఆనందం చూస్తుంటే మరింత ఉత్సాహం కలుగుతోందని, నాన్నగారి పంచెల్ని, వాచీని ఈ సినిమాలో ఉపయోగించామని, అందువల్లే ఇంత విజయం సాధించిందన్న నమ్మకం కలిగిందని అన్నారు. ఈ సినిమా తర్వాత బంగార్రాజు చిత్రాన్ని సీక్వెల్‌గా రూపొందిస్తున్నామని, త్వరలో అన్ని వివరాలు తెలుపుతామని అన్నారు. తొలి అవకాశమే మంచి చిత్రాన్ని ఇచ్చినందుకు సంతోషంగా వుందని, ఈ చిత్రాన్ని ఇంత విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలని, ‘సోగ్గాడే చిన్నినాయన’కి సీక్వెల్‌గా రూపొందిస్తున్న బంగార్రాజు సినిమాకు సంబంధించిన కథాకథనాలు సిద్ధమవుతున్నాయని దర్శకుడు కళ్యాణకృష్ణ కురసాల తెలిపారు. రమ్యకృష్ణ, లావణ్యాత్రిపాఠి, బ్రహ్మానందం, సంపత్, నాగబాబు, సప్తగిరి, పోసాని కృష్ణమురళి తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.