మై ఇండియన్ బాయ్ ఫ్రెండ్...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సశేషం, భూ, దేవిశ్రీప్రసాద్ లాంటి విలక్షణమైన సినిమాలను తెరకెక్కించిన విలక్షణ దర్శకుడు శ్రీకిశోర్ ఇప్పుడు ‘మై ఇండియన్ బాయ్‌ఫ్రెండ్’ అనే చైనీస్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. చైనాలో ఓ ఇండియన్ అబ్బాయి.. చైనీస్ అమ్మాయికీ మధ్య జరిగే రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందబోయే ఈ చిత్రం గురించి దర్శకుడు శ్రీకిశోర్ మాట్లాడుతూ- ఇప్పటివరకూ తెలుగులో సినిమాలు చేసిన నేను ఓ చైనీస్ సినిమా చేస్తే ఎలా వుంటుంది అని ఆలోచించాను. ఎందరో మహామహులున్న చైనా సినిమా రంగంలో నా సినిమాలనెవరైనా చూస్తారా? నేను ఎలాంటి వైవిధ్యమైన చైనా మూవీని తెరకెక్కించగలను? వంటి చాలా ప్రశ్నలు నా బుర్రలో ఉండేవి. అందుకని చాలా రీసెర్చి చేశాను. హాంగ్‌కాంగ్, మెయిన్‌లాండ్, చైనా, తైవాన్ తదితర ప్రాంతాల్లో సినిమా మార్కెట్ ఎలా వుంది? అనే విషయాలను ఆరా తీశాను. ఇక్కడి ప్రేక్షకులు హ్యూమన్ వేల్యూస్, సెన్సిబిలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని తెలిసింది. అందుకని ఆ అంశాల మేళవింపుతో ఇండియన్ స్టయల్‌లో ఆఫ్ చైనీస్ చిత్రం చేయాలని అనుకున్నాను. కొన్ని నిజ ఘటనల ఆధారంగా చేసుకొని చైనీస్ అమ్మాయి, ఇండియన్ అబ్బాయి మధ్య ప్రేమ పుడితే ఎలా వుంటుంది? అనే దానిపై ‘మై ఇండియన్ బాయ్‌ఫ్రెండ్’ అనే రొమాంటిక్ ప్రేమకథను రాశాను. ఇది రెండు దేశాల సంస్కృతులను తెలియజేసేదిగా ఉంటుంది అన్నారు.