వరుణ్‌తేజ్ అంతరిక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో మెగా హీరో వరుణ్‌తేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన అంతరిక్షం సెట్స్‌లో షూటింగ్ జరుగుతోంది. ఘాజి తరువాత సంకల్ప్‌రెడ్డి చేస్తున్న సాటిలైట్ సినిమా ఇది. ఇందులో వరుణ్ తేజ్ వ్యోమగామిగా కనిపించనున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం వరుణ్‌తేజ్ ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇక ఈ సినిమాకు ఏ టైటిల్ పెట్టాలన్న ఆలోచనలో పడ్డాడట దర్శకుడు. ఇప్పటికే పలు రకాల టైటిల్స్ చూశాక ఈ చిత్రానికి అంతరిక్షం అనే టైటిల్ ఫిక్స్ చేశారట. తాజాగా ఈ టైటిల్‌ని ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించారట. వరుణ్‌తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, అతిథిరావు హైదరి హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమా దసరాకు విడుదల చేయాలనీ ప్లాన్ చేశారు. వరుస విజయాలతో జోరుమీదున్న మెగా హీరో వరుణ్‌తేజ్ భిన్నమైన సినిమాలు చేస్తున్నాడు.