టీజర్‌లో శంభో శంకర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంకర్‌ని హీరోగా, శ్రీ్ధర్.ఎన్ దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆర్‌ఆర్ పిక్చర్స్ సంస్థ ఎస్.కె.పిక్చర్స్ సమర్పణలో వై.రమణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తోన్న ‘శంభో శంకర’. ఈ సినిమా టీజర్‌ని దర్శకుడు హరీశ్ శంకర్ విడుదల చేశారు. అనంతరం నిర్మాత వై.రమణారెడ్డి మాట్లాడుతూ- శంకర్, సురేష్ కొండేటి సహకారంతో శంభో శంకర సినిమాను నిర్మించాను. ఖచ్చితంగా ప్రేక్షకాదరణ పొందుతుంది అన్నారు. సురేష్ కొండేటి మాట్లాడుతూ- మంచి సబ్జెక్ట్‌తో శంకర్, దర్శకుడు శ్రీ్ధర్ నా దగ్గరకు వచ్చారు. కథ వినగానే నచ్చడంతో నిర్మాణంలో నేను కూడా పార్ట్ అయ్యాను అన్నారు. దర్శకుడు శ్రీ్ధర్ మాట్లాడుతూ- హరీశ్ శంకర్‌గారికి థాంక్స్. శంకర దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా చేశాను. పాటలు బాగా కుదిరాయి. నా తదుపరి చిత్రం కూడా తనతోనే ఉంటుంది. సాయి కార్తీక్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సినిమాటోగ్రాఫర్ రాజశేఖర్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు అన్నారు. హీరో శంకర్ మాట్లాడుతూ- ఈ సినిమాలో నా వంతు ప్రయత్నం చేశాను. ఫలితాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారు. మంచి నిర్మాతలు సహకారంతో శ్రీ్ధర్ సినిమాని తెరకెక్కించారు. అందరికీ థాంక్స్ అన్నారు. హరీశ్ శంకర్ మాట్లాడుతూ- 35 రోజుల్లో ఈ సినిమాను పూర్తిచేయడం అంత సులభం కాదు. ఈ విషయంలో దర్శక నిర్మాతలను, యూనిట్‌ను అభినందిస్తున్నాను అన్నారు.