సైరా ఫస్ట్‌లుక్ అప్పుడే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. సుమారు 40 రోజులపాటు జరిగే ఈ షెడ్యూల్‌లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేయనున్నారని సమాచారం. ఇంతకుముందే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని స్టిల్స్‌ని అమితాబ్‌బచ్చన్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం ద్వారా ఈ సినిమాలో చిరంజీవి ఎలా ఉంటారో తెలిసిపోయింది. ఈ చిత్రంలో అమితాబ్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.