ఆకట్టుకునే తారామణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంజలి, ఆండ్రియా, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో రామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తారామణి’. ఈ చిత్రం తమిళ్‌లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో జె.ఎస్.కె. ఫిలిం కార్పొరేషన్ సమర్పణలో డి.వి. సినీ క్రియేషన్స్ పతాకంపై డి.వెంకటేష్ తెలుగులో అందిస్తున్నారు. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ సినిమాను తెలుగులో విడుదల చేస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ- సిన్సియర్ ఎఫర్ట్ పెట్టి చేసిన సినిమా. యువన్ శంకర్ ఆడియో సహా సినిమాలో సన్నివేశాలు ప్రామిసింగ్‌గా ఉంటాయి. ఈ రోజుల్లో నేటి ట్రెండ్‌కు తగినట్లు ఉండే సినిమా. మా గుడ్ సినిమా గ్రూప్‌లో సినిమా విడుదల కానుండటం ఆనందంగా ఉంది. గత నెలలోనే సినిమా విడుదల కావాల్సి వుంది కానీ ఆలస్యమైంది. కాబట్టి వచ్చే నెల చివరివారంలో సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. నిర్మాత ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ- మహానుభావుడు సినిమా పొల్లాచ్చిలో జరుగుతున్నపుడు ఈ సినిమాను చేశాను. చాలా బాగా నచ్చింది. తెలుగులో అనువాదం చేసి విడుదల చేద్దామని జ్ఞాన్‌వేల్ రాజాను సంప్రదిస్తే అప్పటికే డి.వెంకటేశ్ హక్కులు దక్కించుకున్నారని తెలిసింది. ఇపుడు మా గుడ్ సినిమా గ్రూప్ ద్వారా విడుదల కావడం ఆనందంగా ఉంది అన్నారు. డి.వెంకటేష్ మాట్లాడుతూ మారుతి తారామణిని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లారు. తమిళంలో పెద్ద హిట్. తెలుగులో కూడా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది అన్నారు. కార్యక్రమంలో శ్రీకాంత్, శ్రేయాస్ శ్రీనివాస్, రాజేశ్, రవి తదితరులు పాల్గొన్నారు.