మలయాళంలో రావణాసురన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన జై లవకుశ సినిమా గత ఏడాది ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. అయితే ఈసారి ఆ సినిమాను మలయాళంలో విడుదల చేయాలని చూస్తున్నారు. రావణా అనే పాత్ర మంచి హైలెట్ అవ్వడంతోపాటు ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం సినిమాకు హైలెట్‌గా నిలిచింది. రావణాసురన్ అనే పేరుతో అక్కడ విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్‌కు మలయాళంలో కూడా మంచి మార్కెట్ ఉంది. గతంలో కొరటాల శివ దర్శకత్వంలో చేసిన జనతాగ్యారేజ్ అక్కడ మంచి వసూళ్లను రాబట్టింది. అంతేకాకుండా తారక్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని కూడా పెంచింది. మోహన్‌లాల్ ఉండడంతో సినిమాను ఎగబడి చూసిన జనాలు తారక్‌కి కూడా అభిమానులు అయిపోయారు. ఇక ప్రస్తుతం జైలవకుశ మలయాళం డబ్బింగ్ పనులు పూర్తయ్యాయి. ఎన్టీఆర్ బ్రదర్ కళ్యాణ్‌రామ్ నిర్మించిన ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. మరి అక్కడ ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.