థ్రిల్ కలిగించే వైఫ్ ఆఫ్ రామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా వైఫ్ ఆఫ్ రామ్. విజయ్ ఎలకంటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ప్రత్యేక అతిథిగా మంచు మోహన్‌బాబుతో రకుల్‌ప్రీత్‌సింగ్, దర్శకుడు వంశీకృష్ణ, నిర్మాత స్వప్నదత్, ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి ట్రైలర్ లాంఛ్ వేడుకలో పాల్గొన్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను మోహన్‌బాబు ఆవిష్కరించారు. రకుల్‌ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ వైఫ్ ఆఫ్ రామ్ ట్రైలర్ నేనే ముందు చూశాను. నాకు థ్రిల్లర్ జానరంటే ఇష్టం. సినిమాలో కొన్ని సీన్స్ కూడా చూశాను. నాకు బాగా నచ్చాయి. విజయ్‌కి ఇది తొలి సినిమాలా లేదు. ఎంటైర్ టీమ్‌తోపాటు లక్ష్మికి ఆల్ ది బెస్ట్ చెప్పింది. దర్శకుడు విజయ్ మాట్లాడుతూ- సినిమా గురించి ఆల్రెడీ ట్రైలర్‌లో చెప్పాను. కానీ సినిమా గురించి ఇప్పుడే ఏమీ మాట్లాడలేను. రిలీజ్ తర్వాత మీరే మాట్లాడతారు అన్నారు. మంచు లక్ష్మి మాట్లాడుతూ- మా నానే్న నాకు పెద్ద గిఫ్ట్. ఏ దశలోనూ ఆర్టిస్టు కావాలని కోరుకోని నేను ఈ స్టేజ్‌లో ఉన్నానంటే అందుకు కారణం మా నానే్న. క్రమశిక్షణ అనే పునాదులపై పెరిగాం మేం. ఈ సినిమాలో శ్రీకాంత్ బ్రిలియంట్ యాక్టర్ ఉన్నా ప్రొడ్యూసర్ నన్ను పూర్తిగా నమ్మడంతో నాకు ఇంకా బాధ్యత పెరిగింది. మా వర్క్‌ను అంత బాగా నమ్మినందుకు విశ్వకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మై రాక్ స్టార్ డైరెక్టర్ విజయ్. అతను లేకపోతే ఈ సినిమాయే లేదు. అతి త్వరలో సినిమా మీ ముందుకు రాబోతోందంటూ తెలిపింది. మోహన్‌బాబు మాట్లాడుతూ- బిడ్డను పొగడొ ద్దని శాస్త్రం చెబుతుంది. అయితే నా బిడ్డను నమ్మిన నిర్మాతలను అభినందిస్తున్నా. ఎందుకంటే నేను ట్రైలర్‌ను చూశాను. అద్భుతంగా వచ్చింది. కానీ నిర్మాత ఎప్పుడూ సెట్స్‌కు రావాలి. ఖచ్చితంగా బడ్జెట్ గురించి తెలుసుకోవాలి. లెక్కలు వేసుకోవాలి. అనవసర ఖర్చును తగ్గించాలి. అప్పుడే మంచి నిర్మాతలుగా ఎదుగుతారు. నాకు దర్శకుడంటే బాగా ఇష్టం. మొదటి సినిమా నీకు గొప్ప విజయం సాధించాలి విజయ్ అన్నారు. దర్శక నిర్మాతలకు, నటీనటులకు, ప్రత్యేక ఆహ్వానితులందరికీ ఆశీస్సులు అందిస్తున్నాను అన్నారు.