‘మా’కు ఎస్వీఆర్ ఉత్సవాల ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలనాటి విశ్వనాథ చక్రవర్తి, లెజెండ్ స్వర్గీయ ఎస్వీ రంగారావుగారి శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని 3 జూలై 2018న ఆయన స్వస్థలం అయిన ఏలూరులో ఎంఎల్‌ఏ బడేటి కోట రామారావు(బుజ్జి) ఎస్వీ రంగారావు కుటుంబీకులు సంయుక్తంగా అతి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఏలూరు ఎంఎల్‌ఏ బడేటి బుజ్జి, ఆంధ్రప్రదేశ్ ఎఫ్‌డీసీ చైర్మన్ అంబికా కృష్ణలు ‘మా’ అసోసియేషన్ సభ్యులను ఆహ్వానించడానికి శనివారం ఉదయం ‘మా’ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎస్వీ రంగారావుగారి శత జయంతి ఉత్సవాల ఆహ్వాన పత్రికను స్వీకరించిన ‘మా’ అసోసియేషన్ సభ్యులు ‘మా’ అధ్యక్షులు శివాజీరాజా, ఏడిద శ్రీరామ్, పరుచూరి వెంకటేశ్వరరావు, బెనర్జీ, నాగినీడు, ‘సంతోషం’ పత్రిక అధినేత, నిర్మాత సురేష్ కొండేటిలు ఎంఎల్‌ఏ బడేటి బుజ్జి, అంబికా కృష్ణను గౌరవ పూర్వకంగా సన్మానించారు.