త్రివిక్రమ్‌తో నాని సినిమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, నేచురల్ స్టార్ నానితో సినిమా చేయబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే ఈ చిత్రం తెరకెక్కటం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించట్లేదు. త్రివిక్రమ్ గతంలోనే నానితో సినిమా చేద్దామనుకున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ దగ్గరనుంచి ఆ చిత్రానికి సంబంధించి ఎలాంటి స్పందన రాలేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత వీర రాఘవ’అనే చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం పూర్తవ్వగానే విక్టరీ వెంకటేష్‌తో ఓ చిత్రం చెయ్యబోతున్నారు. ఆ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్‌వర్క్ కూడా త్రివిక్రమ్ ఎప్పుడో పూర్తిచేశారు. కానీ ‘అరవింద సమేత’ పూర్తిచేసుకొని ఆ చిత్రం నుండి బయటకు రావడానికి త్రివిక్రమ్‌కు మరో ఆరు ఏడు నెలలు పడుతుంది. ఆ తర్వాత వెంకీ చిత్రం మొదలుపెట్టి పూర్తిచేసేసరికి సంవత్సరం పడుతుంది. ఇప్పటి పరిస్థితులనుబట్టి ‘త్రివిక్రమ్, నాని’ సినిమా ఆధారపడి ఉంటుంది.